Credit Card : సిబిల్ స్కోర్ పెరగాలంటే క్రెడిట్ కార్డును ఎలా వాడాలో తెలుసా? ఈ టిప్స్ మీకోసమే!

Published : Apr 24, 2026, 09:51 PM IST

Credit Card : క్రెడిట్ కార్డులు వాడకపోతే క్రెడిట్ స్కోరు పెరుగుతుందని అనుకుంటున్నారా? సిబిల్ స్కోర్ పెరగాలంటే క్రెడిట్ కార్డును ఎలా వాడాలో తెలుసా? ఈ విషయాలు మీకోసమే.

PREV
15
క్రెడిట్ కార్డు వాడుతలేరా? మీకు షాకే !

అప్పుల పాలు కాకూడదని చాలా మంది తీసుకునే మొదటి నిర్ణయం క్రెడిట్ కార్డులను పక్కన పెట్టేయడం. కార్డు వాడకపోతే బిల్లు రాదు, బిల్లు రాకపోతే టెన్షన్ ఉండదు అని భావిస్తారు. కానీ, ఈ జాగ్రత్తే మీ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తుందని మీకు తెలుసా? క్రెడిట్ కార్డును అస్సలు వాడకపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోరు తగ్గిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

25
క్రెడిట్ కార్డును దూరం పెట్టడం వల్ల వచ్చే చిక్కులు ఇవే

చాలా మంది తమ క్రెడిట్ కార్డులను కట్ చేయడం లేదా అల్మారాలో దాచిపెట్టడం అత్యంత తెలివైన పని అని అనుకుంటారు. కార్డు లేకపోతే ఖర్చు ఉండదు, అప్పు ఉండదు అనేది వారి వాదన. కానీ వాస్తవానికి, క్రెడిట్ కార్డులను పూర్తిగా వాడకపోవడం మీ ఆర్థిక ప్రొఫైల్‌ను సైలెంట్ గా దెబ్బతీస్తుంది. మీ క్రెడిట్ స్కోరు అనేది మీరు అప్పు తీసుకోకుండా ఉండటం వల్ల పెరగదు, తీసుకున్న అప్పును ఎంత క్రమశిక్షణతో తిరిగి చెల్లిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

మీరు క్రమం తప్పకుండా కార్డును వాడుతూ, చిన్న మొత్తంలోనైనా ఖర్చు చేస్తూ ఉంటే, మీరు బాధ్యతాయుతంగా డబ్బును తిరిగి చెల్లించగలరని బ్యాంకులకు నమ్మకం కలుగుతుంది. దీనివల్ల మీ పేమెంట్ హిస్టరీ బలంగా మారుతుంది. అదే మీరు కార్డు వాడటం ఆపేస్తే, మీ క్రెడిట్ ఫైల్ ఇన్ యాక్టివ్ అవుతుంది. కాలక్రమేణా మీ ఆర్థిక ప్రవర్తన గురించి బ్యాంకులకు ఎటువంటి సమాచారం అందదు, దీనివల్ల మీ పరపతిని అంచనా వేయడం వారికి కష్టమవుతుంది.

35
కార్డు వాడకపోతే లిమిట్ తగ్గే ఛాన్స్

మీరు మీ క్రెడిట్ కార్డును ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారనే విషయాన్ని బ్యాంకులు నిశితంగా గమనిస్తూ ఉంటాయి. చాలా కాలం పాటు కార్డుపై ఎలాంటి లావాదేవీలు జరగకపోతే, బ్యాంకులు ఆ కార్డు క్రెడిట్ లిమిట్‌ను తగ్గించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ఆ ఖాతాను పూర్తిగా మూసివేయవచ్చు కూడా.

ఇది మీపై నెగటివ్ ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు, ఒక కార్డు క్లోజ్ అయితే, మీకు అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ పరిమితి తగ్గుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరుగుతుంది. మీ స్కోరును నిర్ణయించే కీలక అంశాలలో ఇది ఒకటి. క్రెడిట్ పరిమితి తగ్గి, వినియోగం పెరిగినట్లు కనిపిస్తే అది మీ స్కోరును భారీగా తగ్గిస్తుంది.

45
భవిష్యత్తులో లోన్ రావడం కష్టమేనా?

కార్డు వాడకపోవడం వల్ల కలిగే మరో పెద్ద నష్టం భవిష్యత్తులో తీసుకునే రుణాలపై పడుతుంది. మీరు హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, బ్యాంకులు మీ క్రెడిట్ చరిత్రను తనిఖీ చేస్తాయి. మీ క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నా లేదా మీ ఖాతా అచేతనంగా ఉన్నా, మిమ్మల్ని రిస్క్ ఉన్న కస్టమర్‌గా బ్యాంకులు భావిస్తాయి. దీనివల్ల మీకు లోన్ అప్రూవల్ రావడం కష్టమవ్వడమే కాకుండా, ఒకవేళ వచ్చినా ఎక్కువ వడ్డీ రేట్లు చెల్లించాల్సి రావచ్చు.

55
క్రెడిట్ హెల్త్ మెరుగుపడాలంటే ఏం చేయాలి?

క్రెడిట్ కార్డును పూర్తిగా ఉపయోగించకుండా ఉండటం కంటే.. దానిని తెలివిగా ఉపయోగించడం మంచి పద్ధతి. మీ క్రెడిట్ ప్రొఫైల్ బలంగా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి..

  • చిన్న చిన్న అవసరాలకు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ ఉండండి.
  • నెలవారీ రీఛార్జ్‌లు లేదా చిన్న ఖర్చులకు కార్డు వాడి, ఆ బిల్లును గడువులోపు చెల్లించండి.
  • తద్వారా మీ ఖాతా యాక్టివ్‌గా ఉంటుంది. మీ చెల్లింపు క్రమశిక్షణ బ్యాంకులకు తెలుస్తుంది.
  • మర్చిపోకుండా బిల్లులు కట్టడానికి ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ సెట్ చేసుకోండి.

గుర్తుంచుకోండి, సమస్య క్రెడిట్ కార్డులో లేదు, మీరు దానిని వాడే విధానంలో ఉంది. పూర్తిగా వాడకుండా ఉండటం కంటే, క్రమశిక్షణతో వాడటమే మీ ఆర్థిక భవిష్యత్తుకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories