బ‌య‌ట రెడ్ అల‌ర్ట్ ఉన్నా ఈ స్లిమ్ కూల‌ర్‌తో ఇంట్లో కూల్ కూల్‌.. ఇల్లు చిన్న‌ద‌న్న టెన్ష‌నే వ‌ద్దు

Published : Apr 24, 2026, 02:55 PM IST

Cooler: ఏసీలు కొనుగోలు చేయ‌లేని వారు కూల‌ర్ల‌ను కొంటారు. అయితే ఇంట్లో స్థ‌లం స‌రిపోక కూల‌ర్ల‌తో ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంటుంది. అలాంటి వారికి ఈ స్లిమ్ కూల‌ర్ ప‌ర్‌ఫెక్ట్స్ ఛాయిస్‌గా చెప్పొచ్చు. ఈ ప్రొడ‌క్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం. 

PREV
15
హైఫ్రెష్ ట‌వ‌ర్ ఫ్యాన్

ఇది ఒక మోడర్న్ టవర్ ఫ్యాన్. ఇది సాధారణ ఫ్యాన్ మాత్రమే కాదు, కూలింగ్, హ్యూమిడిఫైయర్ ఫీచర్లతో 3-in-1 డివైస్‌గా పనిచేస్తుంది. ఇంట్లో వేడి తగ్గించడానికి సులభమైన పరిష్కారంగా ఇది ఉపయోగపడుతుంది.

25
4 మోడ్‌లు, 3 స్పీడ్‌లు

ఈ ఫ్యాన్‌లో 3 స్పీడ్‌లు ఉన్నాయి. లో (4.5 m/s), మిడ్ (6 m/s), హై (7.5 m/s). అలాగే ఇందులో మొత్తం 4 మోడ్‌లు ఉన్నాయి. కూలింగ్, నార్మల్, స్లీప్, నేచర్. మీ అవసరానికి అనుగుణంగా ఈ సెట్టింగ్స్ మార్చుకుని సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు.

35
నీరు + ఐస్ ప్యాక్‌తో తక్షణ చల్లదనం

ఈ ఫ్యాన్‌లో 4 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంది. అందులో నీరు, ఐస్ ప్యాక్‌లు వేసినప్పుడు గాలి చల్లగా మారుతుంది. ఇది గాలిని 2 నుంచి 10 డిగ్రీల వరకు చల్లబరచగలదు. 4 ఐస్ ప్యాక్‌లు అందిస్తారు, వీటితో కూలింగ్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

45
తక్కువ కరెంట్ వినియోగం

ఈ ఫ్యాన్ కేవలం 80W పవర్‌తో పనిచేస్తుంది. అంటే ఇది ఎయిర్ కండీషనర్‌తో పోలిస్తే చాలా తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. విద్యుత్ బిల్లు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

55
స్మార్ట్ ఫీచర్లు, సేఫ్టీ

ఇందులో రిమోట్ & టచ్ కంట్రోల్, 12 గంటల టైమర్ (ఆటో ఆఫ్), 70° ఆటో రోటేషన్, 26 అడుగుల వరకు గాలి విస్తరణ, 50dB కంటే తక్కువ శబ్దం వంటి స్మార్ట్ ఫీచ‌ర్లు ఉన్నాయి. అలాగే సేఫ్టీ కోసం వాటర్ లేకపోతే ఆటో ఆఫ్, యాంటీ-డంపింగ్ బేస్, బ్లేడ్‌లెస్ డిజైన్ (పిల్లలకు సురక్షితం), సులభమైన ఉపయోగం, మెయింటెనెన్స్. ఇక ఈ ఫ్యాన్‌ను ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. విండో లేదా పైప్ అవసరం లేదు. ప్లగ్ చేసి వెంటనే ఉపయోగించవచ్చు. క్లీన్ చేయడానికి కూడా డిటాచబుల్ పార్ట్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ డిజైన్ వల్ల ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories