AC rent Business: మండే ఎండల్లో ఏసీ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ కాలంలో రూమ్ చల్లగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ సమయంలో పోర్టుబల్ ఏసీ అద్దెకిచ్చే వ్యాపారం మొదలుపెడితే సైడ్ ఇన్ కమ్ సంపాదించుకోవచ్చు.
వేసవిలో ఎండలు భరించలేక ఏసీలు, కూలర్లు కొనుక్కుంటూ ఉంటారు. కానీ చాలామంది విద్యార్థులు, అద్దె ఇళ్లలో ఉండేవాళ్లు, చిన్న షాపుల వాళ్లు శాశ్వతంగా ఏసీని పెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్లు నివాస ప్రాంతాన్ని తరచూ మారుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు పోర్టబుల్ ఏసీలను అద్దెకిస్తే రెండు నెలల పాటూ వారు మీకు అద్దె చెల్లిస్తారు. ఇది వేసవిలో మాత్రమే నడిచే బెస్ట్ బిజినెస్. నెలకు సులువుగా సంపాదించుకోవచ్చు. దీని కోసం మీరు రెండు నుంచి మూడు పోర్టబుల్ ఏసీలు కొని కొన్ని నెలల పాటు చల్లదనం కావాలనుకునే వారికి అద్దెకు ఇవ్వాలి.
24
ఈ ఏసీ ధరలు ఎంతుంటాయి?
మార్కెట్లో ఒక మంచి పోర్టబుల్ ఏసీ ధర 18,000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇంకా మంచిది కావాలంటే 22,000 రూపాయల దాకా ఖర్చుపెట్టాలి. ఒక పోర్టబుల్ ఏసీకి నెలకు రూ.2,500 నుంచి రూ.4,000 అద్దెకు ఇవ్వచ్చు. నాలు నెలల పాటు ఏసీని అద్దెకు ఇచ్చినా, ఒక మెషీన్‌పై సుమారు ₹12,000 నుంచి ₹15,000 సంపాదించవచ్చు. రెండో ఏడాది నుంచి మీ ఖర్చు వెనక్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేదంతా మీకు లాభమే.
34
పోర్టబుల్ ఏసీ ఎందుకు బెటర్?
సాధారణ ఏసీతో పోలిస్తే పోర్టబుల్ ఏసీ చాలా బెటర్. దీన్ని గోడకు బిగించాల్సిన పనిలేదు. కాబట్టి పగలడం లాంటి ప్రమాదం ఉండదు. మెయింటెనెన్స్ కూడా చాలా సులువు. ఈ రోజుల్లో చాలామంది భారీ ఇన్‌స్టాలేషన్ తలనొప్పుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు. అందుకే రెంటింగ్ ట్రెండ్ పెరుగుతోంది. ఈ పనిని మీరు మీ ఇంటి నుంచే లేదా ఎక్కడి నుంచైనా మొదలుపెట్టొచ్చు.
పోర్టబుల్ ఏసీని అద్దెకు ఇచ్చేందుకు OLX, ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో మీ ఏసీ ఫోటోలు పెట్టాలి. అలాగు అద్దె ఖర్చు వివరాలు, మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. పీజీలు, హాస్టళ్లలో మీ బిజినెస్ గురించి ప్రచారం చేయాలి. వారికే వీటి అవసరం అధికంగా ఉంటుంది. ఎవరికైనా ఏసీ అద్దెకు ఇచ్చేటప్పుడు, వారి నుంచి ఒక ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డ్), సెక్యూరిటీ డిపాజిట్ (అడ్వాన్స్ డబ్బు) తప్పకుండా తీసుకోండి. దీనివల్ల మీ వస్తువు సురక్షితంగా ఉంటుంది, మీకు సమయానికి డబ్బులు వస్తాయి.