Best Electric Scooter: భారత్‌లో ఇంధన ధరల పెరుగుదలతో అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఇక్కడ మేము బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లిస్ట్ ఇచ్చాము. ఓలా ఎస్1 ప్రో, బజాజ్ చేతక్, సింపుల్ వన్, ఏథర్ 450X లాంటి ప్రముఖ మోడళ్లు ఉన్నాయి.
భారత్‌లో పెట్రోలు ధరలు పెరిపోయాయి. దీంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఇష్టపడుతున్నారు. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. దీని వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ పెరుగుతోంది. ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి కుటుంబ, ఆఫీస్ ప్రయాణాలకు మంచి డిమాండ్ ఉంది. వీటిలో మీకు ఏది నచ్చితే అది ఎంపిక చేసుకోవచ్చు.
24
ఓలా ఎస్1 ప్రో
ఓలా S1 ప్రో అనేది ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన మోడల్. దీనికి 11 kW వరకు శక్తిని ఉత్పత్తి చేసే మోటార్, గరిష్టంగా 125 km/h వేగం కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జీ చేస్తే ఏకధాటిన 242 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్లకు పెద్ద టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్ ఉంటుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, ట్యూబ్‌లెస్ టైర్‌ల వంటి ఆధునిక ఫీచర్లతో వస్తాయి. మనదేశంలో ఓలా S1 ప్రో ధర రూ. 1,24,999 నుండి ప్రారంభమై రూ. 1,44,999 వరకు ఉంటుంది . ఓలా S1 ప్రో రెండు వేరియంట్‌లతో వస్తుంది.
34
బజాజ్ చేతక్
బజాజ్ చేతక్ EV బండిని బజాజ్ ఆటోకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది మెటల్ బాడీ, ఆధునిక ఫీచర్లు, వివిధ మోడళ్లతో వస్తుంది. ఈ స్కూటర్ వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కొక్కటి వేర్వేరు బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ కలిగి ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 127 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బండిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటలు పడుతుంది. దీని ధరలు రూ.1,06,780 నుంచి రూ.1,13,898 ఉంటాయి. ఈ ధరలు నగరాలను బట్టి ఆధారపడతాయి.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంతో మంది మనసులు దోచింది. ఇది గంటకు 90 కిలోమీటర్ల దూరాన్ని అందుకుంటుంది. ఈ బైక్ కు రెండు బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. రెండింటిలో మీకు ఏది కావాలో ఎంపిక చేసుకోవచ్చు. ఈ బైక్ ను ఛార్జ్ చేస్తే 5.45 గంటలు సమయం పడుతుంది. ఈ బైక్ డాష్ బోర్డు 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్లతో దీన్ని కనెక్ట్ చేయవచ్చు. ఈ బైక్ ధర రూ. 1,49,047 ఉంటుంది.