Costly Car: కోటి రూపాయల కారు అంటేనే వామ్మో అంటాం. అలాంటిది రూ. 230 కోట్ల కారు ఉంటే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజంగా ఇలాంటి కార్లు అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి కొన్ని కాస్లీ కార్లపై ఓ లుక్కేయండి.
ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ కార్ల మార్కెట్ రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫీచర్లు, పవర్, స్టైల్ వంటి మూడు అంశాలు కలగలిపే ఈ కార్ల ధరలు కోట్లు పలుకుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మూడు కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
25
రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ రూ. 230 కోట్లు
రోల్స్ రాయిస్ Boat Tail కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు. దీని ధర సుమారు రూ. 230 కోట్లు (దాదాపు $2.3 బిలియన్). ఈ కారు పూర్తిగా చేతితో తయారు చేశారు. ఈ కారు డిజైన్ లగ్జరీ యాట్ (Luxury Yacht) నుంచి ప్రేరణ పొందింది. ఈ కారు 6.75-లీటర్ V12 ట్విన్-టర్బో ఇంజిన్‌తో వస్తుంది, ఇది 563 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్రతి చిన్న భాగం ప్రత్యేకంగా రూపొందించారు. వెనుక భాగంలో ఓపెన్ అయ్యే లగ్జరీ డెక్ ఉండటం ఈ కారును మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ యూనిట్లు మాత్రమే తయారు చేశారు.
35
బుగట్టి లా వోయిచర్ నోయిర్
బుగట్టి సంస్థకు చెందిన La Voiture Noire ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ. 160 కోట్లకు పైగా ఉంది. పేరు ఫ్రెంచ్‌లో "బ్లాక్ కారు" అనే అర్థం ఇస్తుంది. ఇది 8.0-లీటర్ క్వాడ్-టర్బో W16 ఇంజిన్‌తో వస్తుంది, ఇది 1,500 హార్స్ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు కేవలం 2.5 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని చేరుతుంది. గరిష్ట వేగం గంటకు 420 kmph. ఇది కేవలం వేగం కోసం కాదు, శ్రద్ధగా రూపొందించిన విలాసవంతమైన డిజైన్ కోసం కూడా ప్రసిద్ధి చెందింది. ప్రతి లైన్, ప్రతి కర్వ్ బుగట్టి ప్రీమియం ఇంజినీరింగ్‌ను ప్రతిబింబిస్తుంది.
మూడవ స్థానంలో ఉన్న Rolls Royce La Rose Noire DropTail నిజమైన కళాఖండం. దీని ధర సుమారు రూ. 125 కోట్లు ఉంటుంది. ఈ కారును “ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కారు”గా పరిగణిస్తారు. బ్లాక్ బక్కారా రోజ్ పువ్వు నుంచి ప్రేరణ పొందిన ఈ కారు డిజైన్ అద్భుతంగా ఉంటుంది. దీని ఇంటీరియర్‌లో సున్నితమైన కస్టమ్ లెదర్, మెరిసే మెటల్ ఫినిష్, ప్రత్యేకమైన బటర్‌ఫ్లై డోర్లను అందించారు. ఈ కారుకు సంబంధించి కేవలం ఒకే మోడల్‌ను రూపొందించారు. దీంతో దీని విలువ మరింత పెరిగింది.
55
లగ్జరీ కార్ల వెనుక ఉన్న కష్టం
ఈ కార్లు కేవలం ప్రయాణ సాధనాలు కాదు అవి ఆర్ట్ వర్క్స్‌కు కూడా పెట్టింది పేరు. ప్రతి కారులో డిజైన్, ఇంజినీరింగ్, లగ్జరీని మిళితం చేశారు. రోల్స్ రాయిస్, బుగట్టి వంటి కంపెనీలు తమ కస్టమర్ల కోసం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా కార్లను కస్టమైజ్ చేస్తాయి.