నెలకు రూ.5,000ల పెన్షన్.. అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Published : Aug 24, 2025, 01:43 PM IST

Atal Pension Yojana: ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టండి. పదవీ విరమణ సమయంలో నెలకు రూ. 5,000 వరకు పెన్షన్ పొందండి. 18-40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పథకంలో చేరవచ్చు. నెలవారీ పెట్టుబడితో భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందండి. 

PREV
15
అటల్ పెన్షన్ యోజన

దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల భవిష్యత్తులో సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana – APY) స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 60 ఏళ్లకు పైబడిన లబ్ధిదారులు ప్రతి నెల స్థిరమైన పెన్షన్ పొందగలుగుతారు. రిటర్మెంట్ ఏజ్ లో నెలకు రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం ముఖ్యంగా 18–40 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తుల కోసం రూపొందించబడింది. చిన్న, స్థిరమైన నెలవారీ విరాళాలు (contribution)తో వారు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను పొందవచ్చు.

25
పథకం లక్ష్యం:

APY ప్రధానంగా వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించడానికి రూపొందించబడింది. చిన్న పెట్టుబడులు కూడా పదవీ విరమణ సమయంలో స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని నిర్ధారిస్తాయి. ఈ పథకంలో చేరిన తర్వాత, ప్రతి నెల వడ్డీతో పెన్షన్ మొత్తం పెరుగుతుంది. దాంతో వ్యక్తులు తమ రిటైర్మెంట్ జీవితంలో నిశ్చితమైన ఆదాయం పొందవచ్చు.

35
ఈ పథకానికి అర్హతలెవరు?

కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో 18–40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు చేరవచ్చు. ప్రతి వయసుకి అనుగుణంగా నెలవారీ చెల్లింపులు (monthly contribution) నిర్ణయించబడతాయి. ఉదాహరణకు, 30 సంవత్సరాల వయస్సులో ప్రవేశించిన వ్యక్తి 60 సంవత్సరాల వయసులో నెలకు రూ. 5,000 పెన్షన్ పొందాలంటే.. ప్రతి నెల దాదాపు రూ. 577 చెల్లించాలి.

45
ఎలా చేరాలి:

APY లో చేరడం చాలా సులభం. ఆసక్తి గల వారు తన సమీప బ్యాంక్, పోస్టాఫీస్ లేదా CSC సెంటర్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కూడా ఈ పథకంలో చేయవచ్చు. APY ఫారం, అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా పథకంలో చేరవచ్చు.

55
ప్రయోజనాలు:

పదవీ విరమణ తర్వాత నెలవారీ స్థిరమైన ఆదాయం పొందవచ్చు. చిన్న పొదుపు ద్వారా పెద్ద ఆర్థిక భద్రత, రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక స్వాతంత్ర్యం, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా సులభంగా చేరుకునే అవకాశం. ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యం. చిన్న చెల్లింపులే అయినా, నెలకు స్థిరమైన పెన్షన్ పొందగలుగుతారు. వృద్ధాప్యంలో సురక్షితంగా, స్వతంత్రంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికీ APY అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories