ఇంట్లో ఉండే నెలకు రూ. 50 వేలు సంపాదించే అవ‌కాశం.. బెస్ట్ బిజినెస్ ఐడియా

Published : Aug 23, 2025, 03:20 PM IST

ఇటీవలి కాలంలో చాలా మంది ఉద్యోగులు కూడా సైడ్ బిజినెస్ చేయాలనే ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
సైడ్ ఇన్‌క‌మ్‌పై పెరుగుతోన్న ఆస‌క్తి

ప్ర‌స్తుతం సైడ్ ఇన్‌క‌మ్ కోరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన ఆర్థిక అవ‌స‌రాలు, పెరుగుతోన్న ఖ‌ర్చుల నేప‌థ్యంలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాల వైపు అన్వేషిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇంట్లో ఉంటూనే చేసే వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియానే హోమ్ మేడ్ చాక్లెట్‌. అందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు చూద్దాం.

25
చాక్లెట్ వ్యాపారం ఎందుకు లాభదాయకం?

చాక్లెట్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దలు అంద‌రూ ఇష్ట‌ప‌డుతారు. ఎప్పటికీ డిమాండ్ తగ్గని ప్రొడక్ట్ ఇది. పండుగలు, పార్టీలు, ఫంక్షన్లు, గిఫ్టింగ్ సందర్భాల్లో చాక్లెట్ అవసరం ఉంటుంది. అందుకే దీనిని వ్యాపారంగా మార్చుకుంటే స్థిరమైన ఆదాయం వస్తుంది. బ్రాండెడ్ చాక్లెట్లతో పాటు, స్థానికంగా తయారైన చాక్లెట్లకు కూడా మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది.

35
ఇంట్లోనే ప్రారంభించగల వ్యాపారం

చాక్లెట్ బిజినెస్‌కి పెద్ద స్థలం, పెద్ద పెట్టుబడి అవసరం లేదు. ఇంట్లోనే చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. కావాల్సింది కేవలం తయారీ పద్ధతులు నేర్చుకోవడం, అవసరమైన ముడి సరుకులు మాత్రమే. పాలు, చక్కెర, కోకో, డ్రైఫ్రూట్స్ వంటి పదార్థాలు ఉంటే సరిపోతుంది. తయారైన చాక్లెట్లను ఆకర్షణీయమైన ర్యాపర్లలో ప్యాక్ చేస్తే మార్కెట్లో సులభంగా విక్రయించవచ్చు.

45
మార్కెటింగ్ మార్గాలు

తయారైన చాక్లెట్లను సొంత బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకురావచ్చు. దగ్గరలోని కిరాణా దుకాణాలు, బేకరీలు, సూపర్ మార్కెట్లతో ముందుగానే కాంట్రాక్టులు చేసుకుంటే అమ్మకాలపై నమ్మకం ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా హోమ్‌మేడ్ ప్రొడక్ట్స్‌కు ప్రమోషన్ చేస్తే ఆన్‌లైన్ ఆర్డర్లు కూడా వస్తాయి.

55
ఆదాయం ఎలా ఉంటుంది.?

చిన్న స్థాయిలో ప్రారంభించినా నెలకు రూ. 25,000 – రూ. 30,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. ఉత్పత్తి పెంచితే, పెట్టుబడిని పెంచితే నెలకు రూ. 1,00,000 వరకు రాబడి వస్తుంది. ఒకవేళ పరిశ్రమ స్థాయిలో యంత్రాలతో తయారీ ప్రారంభిస్తే రూ. 3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఈ బిజినెస్ ద్వారా స్వయంగా లాభం పొందడమే కాకుండా, మరికొందరికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories