ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే రీపోస్ట్ చేయాలంటే మీరు ఆ స్టేటస్ చూసే సమయంలోనే "Allow Sharing" ఆప్షన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ స్టేటస్‌ను మళ్లీ రీపోస్ట్ చేయలేరు.
ఈ ఫీచర్ ద్వారా స్టేటస్‌ల వినియోగం మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ తరచూ తన యూజర్ ఎక్స్‌పీరియెన్స్ మెరుగుపరచేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.
వాట్సాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో అప్డేట్ చేసి, ఈ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.