రైల్వే ట్రాక్ పై మీ ఫోన్ పడిపోయిందా? ఈ నెంబర్ కి కాల్ చెయ్యండి!

First Published | Dec 14, 2024, 4:00 PM IST

రైల్లో ప్రయాణించేటప్పుడు మీ పర్స్, బ్యాగ్ లేదా మొబైల్ లాంటివి జారి పడిపోతే ఏం చేయాలో తెలుసా? ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటంతో రైల్వే డిపార్ట్ మెంట్ చక్కటి ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. ఆ విధానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 

భారతీయ రైల్వే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2.5 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు. బస్సులు, కార్లు, విమానాలతో పోలిస్తే టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో అందరూ ట్రైన్ జర్నీకే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అందుకే ఎక్కువ మంది ప్రజలు రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడతారు.

రైల్లో ప్రయాణించేటప్పుడు మనలో చాలా మంది డోర్ దగ్గర నిలబడి ప్రయాణించడానికి ఇష్టపడతారు. కదా..? కొంతమంది విండోకి దగ్గర కూర్చొని బయట పరిసరాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అదే సమయంలో సెల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. మహిళలైతే రైలు ఎక్కే హడావుడిలో హ్యాండ్ బ్యాగ్ లు, పర్సులు పడేసుకుంటారు. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? ఇలా జరిగి ఉంటే చాలా మంది ఇక ఆ వస్తువు దొరకదని నిరాశ పడి వదిలేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రైల్వే శాఖను సంప్రదిస్తే వెంటనే పడిపోయిన వస్తువు దొరికే ఛాన్స్ ఉంటుంది.   

Tap to resize

రైలులో ప్రయాణించేటప్పుడు ట్రాక్ పై చాలా మంది సెల్ ఫోన్లు పడేసుకుంటారు. డోర్ దగ్గర నుంచొని ప్రయాణించడం వల్ల ఇలా పడిపోతుంటాయి. ఇలా మీ వస్తువులు పడిపోతే వాటిని తిరిగి పొందడానికి రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీని కోసం మీరు ఏం చేయాలంటే.. మీ సెల్ ఫోన్ లేదా వస్తువు పడిపోయిన చోట ఉండే రైల్వే పోల్స్ పై ఉండే పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న నెంబర్లను గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ట్రైన్ లో ఉన్న టికెట్ కలెక్టర్ లేదా రైల్వే పోలీసులకు చెబితే వారు తమ సిబ్బందికి సమాచారం ఇచ్చి రికవరీ చేయిస్తారు. 

ఒకవేళ టీసీ మీకు అందుబాటులో లేకపోతే 182 లేదా 139 నంబరుకి కాల్ చేసి మీ ఫోన్ పడిపోయిన చోటు, రైల్వే పోల్స్ నంబర్లు, దగ్గర్లో ఉన్న స్టేషన్, టైమ్ వంటి వివరాలు చెప్పాలి. వెంటనే వారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు ను పంపించి మీ సెల్ ఫోన్ లేదా వస్తువును రికవరీ చేయిస్తారు. మీరు ఆలస్యం చేస్తే ఆ వస్తువు వేరే ఎవరైనా తీసేసుకొనే ఛాన్స్ ఉంటుంది. 

ఇది కూడా కుదరకపోతే తరువాత స్టేషన్ లో దిగి స్టేషన్ మాస్టర్ ని కలిసి వివరాలు చెప్పండి. రికవరీ జోన్ ఆఫీసర్ ద్వారా వాళ్లు అవసరమైన చర్యలు తీసుకుంటారు.

Latest Videos

click me!