బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి ? ఇలా చేయడం వల్ల ఏం లాభం?

First Published | Oct 18, 2023, 12:04 PM IST

ఆధార్ కార్డ్ నేడు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. సింపుల్ గా చెప్పాలంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా జారీ చేయబడిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. దేశంలో ఆధార్‌ను ప్రధాన ధృవీకరణ పత్రంగా ఉపయోగిస్తారు. 
 

ఆధార్ కార్డ్ లో పూర్తి పేరు, పర్మనెంట్  అడ్రస్,  పుట్టిన తేదీతో సహా వారి  గురించి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. బ్యాంకు అకౌంట్ తెరవడానికి, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, మొబైల్ కనెక్టివిటీకి, ప్రభుత్వ రాయితీలు పొందడానికి అలాగే సోషల్ వెల్ ఫేర్  పథకాల లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరి. 

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018లో బ్లూ ఆధార్ కార్డ్ (బాల్ ఆధార్) కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టింది. దీనిని  5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో చిన్న పిల్లలను చేర్చడాన్ని సులభతరం చేయడంలో బ్లు ఆధార్ కార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆధార్ కార్డు ముఖ్యమైన ఫీచర్  ఏమిటంటే, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు బయోమెట్రిక్ డేటాను అందించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా, వారి UID (యూనిక్ ఐడెంటిటీ) డెమోగ్రాఫిక్ డేటా ఇంకా వారి తల్లిదండ్రుల UIDకి లింక్ చేయబడిన ముఖ చిత్రాన్ని ఉపయోగించి ప్రాసెస్ చేయబడుతుంది.


బ్లూ ఆధార్ కార్డ్ Baal Aadhaar) కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
-  ముందుగా UIDAI.uidai.gov.in అఫీషియల్  వెబ్‌సైట్‌కి వెళ్లండి
- రిజిస్టర్ ఫారమ్‌లో వివరాలను నింపండి.
- రిజిస్ట్రేషన్ కోసం అపాయింట్‌మెంట్ అప్షన్  సెలెక్ట్ చేసుకోండి.
- మీ సమీపంలోని ఎన్ రోల్మెంట్  కేంద్రంలో  అపాయింట్‌మెంట్ తీసుకోండి.
- మీ (తల్లిదండ్రుల) ఆధార్, పిల్లల బర్త్  సర్టిఫికెట్, రిఫరెన్స్ నంబర్ మొదలైనవాటిని ఆధార్ కేంద్రానికి తీసుకువెళ్ళండి.
- అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత, అప్ డేట్ ట్రాక్ చేయడానికి రసీదు నంబర్   పొందండి.

దింతో మీరు మీ పిల్లల ఆధార్ సేవల కోసం రిజిస్టర్  చేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తి అవుతుంది. దరఖాస్తు ప్రక్రియ తర్వాత, మీరు UIDAI అఫీషియల్  వెబ్‌సైట్ నుండి మీ పిల్లల ఆధార్ కార్డ్ డిజిటల్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

బ్లు  కలర్  ఆధార్ కార్డు
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు నీలం రంగులో ఉంటుంది. దీనినే BAAL ఆధార్ అంటారు. పిల్లల వయస్సు 5 ఏళ్లు దాటిన తర్వాత ఈ బ్లు  కలర్  ఆధార్ కార్డు  చెల్లదు. కాబట్టి ఐదేళ్ల తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి. ఐదేళ్లు దాటిన తర్వాత పిల్లల బయోమెట్రిక్‌ తీసుకుంటారు. ఐదేళ్ల తర్వాత ఆధార్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లల బొటనవేలు గుర్తు, కంటి గుర్తు తీసుకుంటారు. పిల్లలు 15 ఏళ్లు నిండిన తర్వాత ఆధార్‌ను రెన్యూవల్ చేసుకోవాలి. 

Latest Videos

click me!