2023 హురాన్ రిచ్ లిస్ట్ ప్రకారం, జెఫ్ బెజోస్ మొత్తం విలువ $114 బిలియన్లు. అతను బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఎలోన్ మస్క్ తర్వాత ప్రపంచంలోని మూడవ అత్యంత ధనవంతుడు.
బెజోస్ 2021లో అమెజాన్ సీఈఓ పదవి నుంచి వైదొలగారు. బెజోస్‌కు ఇప్పటికీ కంపెనీలో 10 శాతం వాటా ఉంది. అతనికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్, స్పేస్ టూరిజం కంపెనీ బ్లూ ఆరిజిన్ ఉన్నాయి. బ్లూ ఆరిజిన్ కమర్షియల్ స్పేస్ స్టేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు బెజోస్ గతంలో ప్రకటించారు. 'ఆర్బిటల్ రీఫ్' అని పేరుతో ఈ స్టేషన్ ఈ దశాబ్దం చివరి నాటికి పని చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు ఈ ప్రాజెక్టుపై ఇంతకుముందు వెల్లడించారు.