తక్కువ వడ్డీకి లోన్ కావాలా..? ఇండియాలోని బ్యాంకులు విధించే లోన్ వడ్డీ రేట్లు ఇక్కడ ఉన్నాయి..

First Published | Oct 14, 2023, 2:37 PM IST

సాధారణంగా, బ్యాంకులు లోన్ తిరిగి చెల్లించడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు అనేదానిపై ఆధారపడి వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. దేశంలోని ప్రముఖ బ్యాంకులు విధించే  వడ్డీ రేట్లను ఒక్కసారి ఇక్కడ చూద్దాం...
 

రుణం కావాలా ? దేశంలోని బ్యాంకులు విధించే వడ్డీ రేట్లను తెలుసుకున్న తర్వాత మాత్రమే సరైన లోన్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అంటే MCLR అత్యల్ప రుణ రేటు. దీని కంటే తక్కువ వడ్డీని అందించడానికి ఏ బ్యాంకుకు అనుమతి లేదు. 
 

సాధారణంగా, బ్యాంకులు లోన్ తిరిగి చెల్లించడానికి ఎంత సమయం పడుతుంది అనేదానిపై ఆధారపడి వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. ఈ వ్యవధి  ఎక్కువగా ఒక రాత్రి, ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, 1 సంవత్సరం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. చాలా కన్స్యూమర్ లోన్లను  బ్యాంకులు ఒక సంవత్సరం పాటు ఇస్తాయి. 
 


అక్టోబర్ 2023 నెలలో బ్యాంకుల రుణ రేట్లను చూద్దాం... 
ICICI బ్యాంక్ 

ICICI బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక నెల MCLR రేటు 8.45 శాతం. మూడు నెలల, ఆరు నెలల MCLRలు వరుసగా 8.50 శాతం అండ్ 8.85 శాతం. ఒక సంవత్సరం MCLR 8.95%.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 

ఓవర్‌నైట్ లెండింగ్ రేటు 8.15 శాతం. ఒక నెల MCLR రేటు 8.25 శాతం కాగా, మూడు నెలల అండ్  ఆరు నెలల MCLRలు వరుసగా 8.35 శాతం ఇంకా 8.55 శాతం. ఒక సంవత్సరం MCLR ఇప్పుడు 8.65 శాతం.

యస్ బ్యాంక్ 

యస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఓవర్‌నైట్ లెండింగ్ రేటు 8.80 శాతం. ఒక నెల MCLR రేటు 9.05 శాతం. మూడు నెలల ఇంకా ఆరు నెలల MCLRలు వరుసగా 9.70 శాతం అలాగే  9.95 శాతం. ఒక సంవత్సరం MCLR ఇప్పుడు 10.25 శాతం.

బ్యాంక్ ఆఫ్ ఇండియా 

ఓవర్‌నైట్ లెండింగ్ రేటు 7.95 శాతం, ఒక నెల MCLR రేటు 8.15 శాతం. బ్యాంక్ ఆఫ్ ఇండియా  మూడు నెలల ఆరు నెలల MCLRలు వరుసగా 8.30 శాతం ఇంకా 8.50 శాతం. ఒక సంవత్సరానికి MCLR ఇప్పుడు 8.70 శాతం అండ్ మూడేళ్లకు 8.90 శాతం.
 

HDFC బ్యాంక్

HDFC  బ్యాంక్ ఓవర్‌నైట్ లెండింగ్ రేటు 8.60 శాతం. ఒక నెల MCLR 8.65 శాతం. మూడు నెలల MCLR 8.85 శాతంగా ఉంటుంది. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 9.10 శాతం.  కన్యూమర్  రుణాలకు అనుసంధానించబడిన ఒక సంవత్సరం MCLR 9.20 శాతం.

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక నెల MCLR రేటు 8.05 శాతం. మూడు నెలల MCLR రేటు 8.15 శాతం. అలాగే, బ్యాంక్ ఆరు నెలల MCLR రేటును 8.5 శాతం విధిస్తుంది. 

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

 ఒక నెల MCLR రేటు 8.20 శాతం. మూడు నెలల MCLR రేటు 8.30 శాతం. అలాగే, బ్యాంక్ ఆరు నెలల MCLR రేటు 8.5 శాతం, ఒక సంవత్సరం MCLR రేటు 8.7 శాతం, 

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా 8 శాతం ఓవర్‌నైట్ వడ్డీని విధిస్తుంది. ఒక నెల, మూడు నెలలు అండ్  ఆరు నెలల కాలవ్యవధికి 8.25 శాతం, 8.35 శాతం అండ్ 8.45 శాతం. ఒక సంవత్సరం MCLR 8.70 శాతం.

Latest Videos

click me!