ప్రపంచంలోని అత్యంత ధనికుల సంపద ఒక్కసారిగా ఆవిరి.. ఒక్కరోజులోనే లక్ష కోట్లకు పైగా ఆంఫట్..

First Published Dec 4, 2021, 12:31 PM IST

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా (tesla)అండ్ స్పేస్‌ఎక్స్ (spaceX)అధినేత ఎలోన్ మస్క్ అతని సంపదలో శుక్రవారం భారీ నష్టాన్ని చవిచూశారు. ఒక నివేదిక ప్రకారం, టెస్లా ఇంక్ షేర్ల పతనం కారణంగా ఎలోన్ మస్క్ (elon musk)సంపద శుక్రవారం నాడు 15.2 బిలియన్ డాలర్లు (రూ. 1 లక్షా 13 వేల 208 కోట్లు) పడిపోయింది. టెస్లా స్టాక్‌లలో పతనం, ద్రవ్యోల్బణం,  ఆర్థిక సంక్షోభం అవకాశాల కారణంగా  టెస్లాపై పెద్ద ప్రభావం చూపిందని పేర్కొంది. 
 

టెక్ స్టాక్స్ పతనం 
బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం, టెస్లా ఇంక్ షేర్ల ధర పతనం  కారణంగా శుక్రవారం ఎలోన్ మస్క్ సంపద 268.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. గురువారం నాటికి ఎలోన్ మస్క్ నికర విలువ సుమారు 284 బిలియన్ల డాలర్లు.

అలాగే టెస్లా సి‌ఈ‌ఓతో పాటు ప్రపంచంలోని ఇతర ధనవంతుల సంపదలో క్షీణత ఏర్పడింది. ఇందులో ఎలోన్ మస్క్ తర్వాత అమెజాన్ కు చెందిన జెఫ్ బెజోస్ పేరు కూడా ఉంది. జెఫ్ బెజోస్ సంపద కూడా శుక్రవారం 2.7 బిలియన్ డాలర్లు క్షీణించింది. అమెజాన్ ఇంక్ షేర్లు శుక్రవారం 1.4 శాతం వరకు పడిపోయాయి. ఈ పతనం తర్వాత జెఫ్ బెజోస్ నికర విలువ 195 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. నివేదిక ప్రకారం టాప్ 10 యూ‌ఎస్ టెక్ బిలియనీర్ల నికర విలువ కలిపి 27.4 బిలియన్ల డాలర్లకు తగ్గింది. 

మార్క్ జుకర్‌బర్గ్-లారీతో సహా
ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల సంపదతో పాటు ప్రపంచంలోని ఇతర బిలియనీర్ల సంపదకు నష్టం వాటిల్లింది. ఈ జాబితాలో ఒరాకిల్ కార్ప్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్, ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జుకర్‌బర్గ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, బిల్ గేట్స్ పేర్లు కూడా ఉన్నాయని ఒక నివేదిక పేర్కొంది. ఈ కుబేరుల సంపద కూడా క్షణికావేశంలో గణనీయంగా తగ్గిపోయింది. నివేదికలో ఇచ్చిన గణాంకాలను పరిశీలిస్తే లారీ ఎలిసన్ సంపద 2.6 బిలియన్ డాలర్లు తగ్గగా, మార్క్ జుకర్‌బర్గ్ సంపద 1.3 బిలియన్ డాలర్లు తగ్గి 114.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

అదనంగా, ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తి బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 1.22 బిలియన్ల డాలర్లకు తగ్గింది, ఆ తర్వాత అతని నికర విలువ 161 బిలియన్ల డాలర్లకు చేరింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే అతని సంపద 1.39 బిలియన్ డాలర్లు తగ్గి 133 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 

click me!