ఈ‌పి‌ఎఫ్‌ఓ న్యూస్: ఇప్పుడు 1 గంటలో మీ పి‌ఎఫ్ డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి.. ఎలాగో తెలుసుకోండి..

First Published Dec 3, 2021, 6:44 PM IST

కరోనా  వైరస్(corona virus) వంటి మహమ్మారి ప్రజల్లో వ్యాప్తి చెందుతున్నప్పటి నుండి డబ్బు ప్రాముఖ్యత మరింత పెరిగింది. ప్రజలు ఇప్పుడు డబ్బు ఖర్చు చేయడం కంటే ఎక్కువ పొదుపుపై ​​దృష్టి సారిస్తున్నారు. డబ్బు ఎప్పుడు, ఎలా అవసరమో ఎవరికీ తెలియదు. కుటుంబంలో అకస్మాత్తుగా ఏదైనా అత్యవసరం వస్తే వెంటనే డబ్బు అవసరం. 

అవసరమైన సమయాల్లో మనం ఎవరినైనా డబ్బు అడగటం లేదా మన పి‌ఎఫ్ (provident fund)ఖాతా నుండి విత్‌డ్రా చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటాము. పీఎఫ్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుండడంతో ఇబ్బందులు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పీఎఫ్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే నిబంధనలలో కొంత ఉపశమనంతో ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రారంభించింది.

ఈ రూల్ ప్రకారం ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ నుండి ముందుగా లక్ష రూపాయలను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీలో ఉంటే వీలైనంత తక్కువ సమయంలో ఎప్పుడైనా ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.ఆన్‌లైన్ ప్రక్రియ నుండి డబ్బును ఎలా ఉపసంహరించుకోవచ్చో తెలుసుకోండి...

పి‌ఎఫ్ డబ్బును ఎలా ఉపసంహరించుకోవాలి  అంటే..?
ముందుగా epfindia.gov.in కు లాగిన్ అవ్వండి 
మీరు వెబ్‌సైట్ హోమ్ పేజీలో కుడి వైపు మూలన ఆన్‌లైన్ అడ్వాన్స్ క్లెయిమ్ ఆప్షన్ చూస్తారు. 
మీరు ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
ఆ తర్వాత ఆన్‌లైన్ సర్వీస్ కు వెళ్లండి. 
ఆ తర్వాత క్లెయిమ్ ఫారమ్-31, 19, 10C అండ్ 10Dలను జాగ్రత్తగా నింపండి.   

ఫారమ్‌ను నింపిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలోని చివరి 4 అంకెలను ఎంటర్ చేసి వేరిఫై చేయండి
వేరిఫై చేసిన తర్వాత ఆన్‌లైన్ క్లెయిమ్ కోసం ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి. 
ఆ తర్వాత పీఎఫ్ అడ్వాన్స్ ఆప్షన్ ఎంచుకొండి
మీరు డబ్బు విత్‌డ్రా చేయడానికి కారణం అడుగుతుంది
కారణాన్ని ఎంటర్ చేసి ఆప్షన్ పై క్లిక్ చేయండి. 

పి‌ఎఫ్ డబ్బుని  ఎంటర్ చేసి అలాగే చెక్కు స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి. 
దీని తర్వాత దరఖాస్తుదారు తన పూర్తి అడ్రసును నింపాలి.
గెట్ ఆధార్ OTPపై క్లిక్ చేయండి అలాగే OTP ఆధార్‌తో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు వస్తుంది
OTPని ఎంటర్ చేసి క్లిక్ చేయండి. 
ఇప్పుడు మీ క్లెయిమ్ ఫైల్ చేయబడుతుంది అలాగే 1 గంటలో మీ పి‌ఎఫ్ డబ్బు మీ ఖాతాలోకి వస్తుంది. 

మెడికల్ బిల్లు అవసరం లేదు 
 ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఈ సమయంలో ఎప్పుడైనా డబ్బు అవసరం కావచ్చు కాబట్టి ఈ కొత్త సిస్టంను అమలు చేసినట్లు తెలిపింది. ఇంతకుముందు కూడా మెడికల్ క్లెయిమ్‌ కోసం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు కానీ మెడికల్ బిల్లును అందించాలి ఉంటుంది. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మెడికల్ బిల్లు సమర్పించాల్సిన అవసరం లేదు అలాగే మీ డబ్బు అతితక్కువ  సమాయాంలో మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. 
 

click me!