petrol diesel price:పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. ఈ నగరాల్లో లీటరు ధర ఎంత తగ్గిందంటే ?

First Published Dec 4, 2021, 11:45 AM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వ చమురు కంపెనీలు (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు (todays fuel prices) విడుదల చేశాయి. కొత్త ధరల ప్రకారం నేడు దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ (petrol)ధర లీటరుకు రూ. 95.41 కాగా, డీజిల్ లీటరుకు రూ. 86.67గా విక్రయిస్తున్నారు. ఈరోజు డిసెంబర్ 4వ తేదీ శనివారం ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

రెండు రోజుల క్రితం ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93 నుంచి రూ.95.41కి తగ్గింది.

ఏ నగరంలో పెట్రోల్ ధర ఎంత  
ఢిల్లీలో పెట్రోల్ రూ. 95.41, డీజిల్ లీటరుకు రూ. 86.67గా ఉంది.
ముంబైలో పెట్రోల్ రూ. 109.98, డీజిల్ లీటరు రూ. 94.14.
చెన్నైలో లీటరు పెట్రోల్ రూ.101.40, డీజిల్ ధర రూ.91.43.
కోల్‌కతాలో పెట్రోల్ రూ.104.67, డీజిల్ లీటరుకు రూ.89.79.
లక్నోలో పెట్రోల్ రూ. 95.28, డీజిల్ లీటర్ రూ. 86.80.
గాంధీనగర్‌లో పెట్రోల్‌ రూ.95.35, డీజిల్‌ లీటరు రూ.89.33గా ఉంది.
పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ రూ. 82.96, డీజిల్ లీటరుకు రూ.77.13.

వరుస  మూడో రోజు కూడా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను యధాతధంగా కొనసాగించాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100 పైగా ఉండటంతో పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికీ సామాన్యుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.


మీ నగరంలో  పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకోవాలంటే మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. IndianOil వెబ్‌సైట్ ప్రకారం మీరు RSP అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249కి ఎస్‌ఎం‌ఎస్  పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.
 

ఇక్కడ చెక్ చేయండి- https://iocl.com/Products/PetrolDieselPrices.aspx

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.  

click me!