Viral News: పాత రూ. 500 నోట్ల‌ను మార్చుకునే అవ‌కాశం..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఆర్బీఐ

Published : Apr 18, 2026, 01:48 PM IST

Viral News: సోష‌ల్ మీడియాలో ఏ వార్త వైర‌ల్ అవుతుందో తెలియదు. తాజాగా ఇలాంటి ఓ పోస్ట్ ట్రెండ్ అవుతోంది. కేంద్రం గ‌తంలో ర‌ద్దు చేసిన పాత రూ. 500, వెయ్యి నోట్ల‌ను మళ్లీ మార్చుకునే అవ‌కాశం క‌ల్పించిందంటూ పోస్టులు వైర‌ల్ కావ‌డంతో ఆర్బీఐ స్పందించింది. 

PREV
15
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లెయిమ్

సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్ రూపంలో ఓ సమాచారం షేర్ అవుతోంది. అందులో RBI పాత రూ. 500, రూ. 1000 నోట్ల మార్పిడికి కొత్త రూల్స్ తీసుకువచ్చిందని పేర్కొన్నారు. అలాగే RBI గవర్నర్ ఫోటోను జత చేసి, వార్తను నిజమైనదిగా చూపించే ప్రయత్నం చేశారు. దీంతో చాలా మంది ఈ స‌మాచారం నిజ‌మే కావొచ్చ‌ని అనుకుంటున్నారు. అయితే ఇంకా పాత నోట్లు మార్కెట్లో ఉన్నాయా.? అన్న ప్ర‌శ్న కూడా వ‌స్తోంది.

25
PIB ఫ్యాక్ట్ చెక్ ఏమంటోంది?

ఈ వైరల్ వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ చేసింది. వారి ప్రకారం ఈ క్లెయిమ్ పూర్తిగా తప్పుడు. RBI ఇలాంటి ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టంగా తెలిపింది. కరెన్సీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం కోసం ప్రజలు ఎప్పుడూ RBI అధికారిక వెబ్‌సైట్స్ లేదా సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌ మాత్రమే నమ్మాలని సూచించింది. అంటే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తకు ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.

35
త‌ప్పుడు స‌మాచారం షేర్ చేయొద్దు

PIB ఈ సందర్భంలో ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఇచ్చింది. ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని ముందుగా సరిచూసుకుని మాత్రమే నమ్మాలని సూచించింది. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, ఫోటోలు, వీడియోలను అజాగ్రత్తగా షేర్ చేయొద్దని తెలిపింది. అధికారిక సోర్సుల‌ నుంచి వచ్చిన సమాచారం మాత్రమే విశ్వసనీయమని స్పష్టం చేసింది.

45
500, 1000 నోట్లు ఎప్పుడు రద్దయ్యాయి?

భారతదేశంలో రూ. 500, రూ. 1000 పాత నోట్లను 2016 నవంబర్ 8న రద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఆ రోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనిని నోట్ల రద్దు లేదా డీమోనిటైజేషన్‌గా పిలుస్తారు. తర్వాత పాత రూ. 500 నోట్ల స్థానంలో కొత్త రూ. 500 నోటు విడుదల చేశారు. అలాగే రూ. 1000 స్థానంలో రూ. 2000 నోటు ప్రవేశపెట్టారు. అయితే తర్వాత కాలంలో రూ. 2000 నోటును కూడా చలామణి నుంచి తొలగించారు.

55
నోట్ల రద్దు వెనుక కారణాలు

నోట్ల రద్దు నిర్ణయం వెనుక ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. బ్లాక్ మ‌నీని నియంత్రించడం, నకిలీ నోట్లను అరికట్టడం, అవినీతిని తగ్గించడం, అలాగే ఉగ్రవాదానికి వెళ్లే నిధులను నిలిపివేయడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థను బ‌లోపేతం చేయడానికి తీసుకున్న కీలక నిర్ణయంగా కేంద్రం తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories