Today Gold Rate: బిగ్ రిలీఫ్..బంగారం ధరలు ఢమాల్..ఇప్పుడే కొనేయండి

Published : Apr 17, 2026, 11:08 AM IST

Today Gold Rate: మగువులకు గుడ్ న్యూస్. మళ్లీ బంగారం ధరలు తగ్గాయోచ్. అక్షయ తృతీయకు ముందు గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో మహిళలు, కొనుగోలుదారులకు ఊరట దొరికింది. 

PREV
16
బంగారం కొనేవారికి గొప్ప గుడ్ న్యూస్

మూడు రోజులుగా పెరుగుతూ షాక్ ఇచ్చిన పసిడి...ఇప్పుడు మళ్లీ పతనమైంది. అక్షయ తృతీయ, అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు..ఇవన్నీ కలిసి బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.వ

26
24 క్యా గ్రాముకు రూ.15,420

భారత్‌లో 24 క్యారెట్ బంగారం ధర సుమారు గ్రాముకు రూ.15,420 వరకు ఉండగా, 22 క్యారెట్ ధర రూ.14,135 చుట్టూ ఉంది.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు చూసుకుంటే...24 క్యారెట్ల మేలిమి బంగారంపై 10 గ్రాములకు రూ.1370 తగ్గి, రూ.1,54,200 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1250 పతనమై రూ.1,41,350 పలుకుతోంది. సిల్వర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది. 

36
వడ్డీ రేట్లు పెరగడం

బంగారం ధరలు తగ్గడానికి ముఖ్యమైన కారణాల్లో మొదటిది వడ్డీ రేట్లు పెరగడం. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడిదారులు బ్యాంకులు, బాండ్లు వంటి స్థిరమైన రాబడి ఇచ్చే ఆప్షన్లను ఎంచుకుంటారు. దీంతో బంగారం మీద పెట్టుబడి తగ్గుతుంది. ఎందుకంటే బంగారం ఎలాంటి వడ్డీ ఇవ్వదు. అందువల్ల డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి. 

46
డాలర్ బలపడటం

మరొక కీలక అంశం అమెరికన్ డాలర్ బలపడటం. గ్లోబల్‌గా బంగారం ధరలు డాలర్‌లో నిర్ణయించబడతాయి. డాలర్ విలువ పెరిగితే ఇతర దేశాల వారికి బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా బంగారం ధరలు కిందకు వస్తాయి. 

56
జియోపాలిటికల్ టెన్షన్స్

అలాగే జియోపాలిటికల్ టెన్షన్స్ తగ్గినా బంగారం ధరలు తగ్గుతాయి. సాధారణంగా యుద్ధాలు, రాజకీయ అస్థిరత ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని “సేఫ్ హెవెన్”గా చూస్తారు. కానీ పరిస్థితులు స్థిరంగా మారితే వారు స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం మీద ఒత్తిడి పెరిగి ధరలు పడిపోతాయి. 

66
సీజనల్ డిమాండ్

ఇంకో కారణం ప్రాఫిట్ బుకింగ్. బంగారం ధరలు ఒక స్థాయికి ఎక్కువగా పెరిగిన తర్వాత పెట్టుబడిదారులు తమ లాభాలను బుక్ చేసుకోవడానికి అమ్మకాలు చేస్తారు. మార్కెట్‌లో సరఫరా పెరగడం వల్ల తాత్కాలికంగా ధరలు తగ్గుతాయి. ఇది చాలా సాధారణమైన మార్కెట్ ప్రవర్తన.

భారత్ వంటి దేశాల్లో సీజనల్ డిమాండ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పెళ్లిళ్లు, పండుగలు లేని సమయంలో బంగారం కొనుగోలు తగ్గుతుంది. దీంతో డిమాండ్ తగ్గి ధరలు కొంతవరకు తగ్గుతాయి. అలాగే ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు కూడా బంగారం మీద ఆసక్తి తగ్గుతుంది, ఎందుకంటే అది ప్రధానంగా ద్రవ్యోల్బణానికి రక్షణగా ఉపయోగిస్తారు.

మొత్తంగా చూస్తే, బంగారం ధరలు తగ్గడం అనేది మార్కెట్‌లో సహజమైన సైకిల్‌లో భాగమే. ఇది పూర్తిగా పడిపోవడం కాదు, తాత్కాలిక సవరణ మాత్రమే. దీర్ఘకాలంలో బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో ఇలాంటి మార్పులు కనిపించడం సహజం. 

Read more Photos on
click me!

Recommended Stories