Tatkal Ticket: మీకు తెలుసా? ఇకపై ట్రైన్ లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు దాని వల్ల కలిగే లాభాలను కూడా వివరించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దీనివల్ల రైళ్లలో కన్ఫర్మ్ టికెట్ పొందడం చాలా కష్టంగా మారింది. అత్యవసర సమయాల్లో రైల్వే తత్కాల్ పథకం ఉపయోగపడుతుంది. ప్రయాణానికి ఒక రోజు ముందుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. ఇది అత్యవసర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.
25
కన్ఫర్మ్ టికెట్స్ దొరకడం లేదని కంప్లైంట్స్
అయితే, ఎక్కువ డిమాండ్, తక్కువ టిక్కెట్ల లభ్యత కారణంగా కన్ఫర్మ్డ్ తత్కాల్ టికెట్ పొందడం చాలా కష్టం. చాలా మందికి త్వరగా కన్ఫర్మ్డ్ తత్కాల్ టికెట్లు దొరకడం లేదు. సామాన్యులకు తత్కాల్ టికెట్లు దొరకని పరిస్థితిలో ఏజెంట్లు సులభంగా తత్కాల్ టికెట్లు పొందుతున్నారని ప్రజల నుంచి ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి.
35
ఆధార్ తో మోసాలకు అడ్డుకట్ట
చాలా మంది ఒకటి కంటే ఎక్కువ నకిలీ అకౌంట్స్‌తో తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నారని, తత్కాల్‌లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని రైల్వేపై నిరంతరం ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. దీని ద్వారా అవకతవకలను అరికట్టవచ్చని రైల్వే తెలిపింది.
తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే తత్కాల్ టికెట్ బుక్ అవుతుంది.
కౌంటర్లలో తత్కాల్ టికెట్లు పొందడానికి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తారు. ఈ ఆధార్ వెరిఫికేషన్ ద్వారా మోసాలను, అవకతవకలను నివారించవచ్చని రైల్వే భావిస్తోంది.
55
ఓటీపీ ఎంటర్ చేసే లోపు టైమ్ అయిపోతే..?
ఆధార్ వెరిఫికేషన్ ద్వారా సరైన ఆధార్ ఉన్నవారికే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. దీని ద్వారా ఎక్కువ టికెట్లు బుక్ చేసే దళారులను అడ్డుకోవచ్చు.
అయితే మొబైల్‌లో ఆధార్ ఓటీపీ రావడానికి ఆలస్యమైనా, ఓటీపీ ఎంటర్ చేసేలోపు సమయం అయిపోయినా టికెట్ బుక్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఓటీపీలు పంపిచడంలో బలమైన సిస్టమ్ ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు.