UPI ద్వారా ATMలో డబ్బు తీసుకోవడం చాలా సులభం. ఇందుకోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
* ముందుగా UPI క్యాష్ విత్‌డ్రాయల్ సపోర్ట్ చేసే ATM వద్దకు వెళ్లాలి.
* ATM స్క్రీన్‌లో కనిపించే UPI Cash Withdrawal ఎంపికను ఎంచుకోవాలి.
* తీసుకోవాలనుకున్న మొత్తం నమోదు చేయాలి (గరిష్ఠం రూ. 10,000).
* ATM స్క్రీన్‌పై ఒక QR కోడ్ కనిపిస్తుంది.
* మీ మొబైల్‌లోని UPI యాప్ ఓపెన్ చేసి ఆ QR కోడ్ స్కాన్ చేయాలి.
* మీ బ్యాంక్ ఖాతా ఎంపిక చేసి UPI PIN నమోదు చేయాలి.
* ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక ఏటీఎమ్ నుంచి డబ్బులు వస్తాయి.