Stock: మీ దగ్గర లక్ష రూపాయల పెట్టుబడి ఉందా? అయితే దానిని ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఐదు ప్రధాన రంగాలు, వాటిలోని బెస్ట్ స్టాక్స్..
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య మంచి డిస్కౌంట్‌లో అద్భుతమైన స్టాక్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమని నిపుణులు పేర్కొన్నారు. లక్ష రూపాయల పెట్టుబడితో ఒక పటిష్టమైన, స్థిరమైన పోర్ట్‌ఫోలియోను ఇలా నిర్మించుకోవచ్చు.
25
ఐటీ రంగం
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ రంగంలో TCSను బెస్ట్ ఆప్షన్. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం బై-బ్యాక్ (Buy-back) ఆఫర్లు ఇవ్వడం, స్థిరమైన వృద్ధిని కనబరచడం దీని ప్రధాన బలం.
35
ఎఫ్‌ఎంసీజీ
నిత్యావసర వస్తువుల రంగం ఎప్పుడూ సురక్షితమైనది. ఈ విభాగంలో ITC స్టాక్‌ను రికమండ్ చేశారు నిపుణులు. మంచి డివిడెండ్ యీల్డ్, గత కొంతకాలంగా అండర్ పెర్ఫార్మెన్స్‌లో ఉండటంతో ఇప్పుడు ఈ స్టాక్ కొనుగోలుకు అనుకూలంగా ఉంది.
మౌలిక సదుపాయాల అభివృద్ధి నేపథ్యంలో మెటల్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ రంగంలో SAIL (Steel Authority of India)ను బెస్ట్ పిక్‌గా పేర్కొన్నారు
55
ఆటోమొబైల్
భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే(EV). ఈ విభాగంలో ఇప్పటికే పరిశోధనలు పూర్తి చేసి వాహనాలను విడుదల చేస్తున్న Tata Motorsను సూచించారు. టాటా గ్రూపుకు చెందిన ఇతర సంస్థల సహకారంతో ఈ కంపెనీ ఈవీ రంగంలో అగ్రగామిగా నిలవనుంది.
వీటితో పాటు Reliance Industriesను కూడా పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. రిలయన్స్ టెలికాం, రిటైల్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతుండటమే ఇందుకు కారణం. ఒకేసారి లక్ష రూపాయలను ఇన్వెస్ట్ చేయకుండా, ప్రతి నెలా కొంత మొత్తాన్ని SIP(Systematic Investment Plan) రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు పొందవచ్చని సలహా ఇచ్చారు.