కొత్త వారంలో 3 ఐపీవోలు మార్కెట్లలోకి రానున్నాయి. నేటితో LIC IPO సందడి ముగియనుంది. మే 10, 11 తేదీల్లో మూడు ఐపీవోలు మార్కెట్లో ప్రారంభం కానున్నాయి. Venus Pipes & Tubes Limited, Prudent Corporate Advisory Services, Delhivery సంస్థలు ఐపీవో ద్వారా నిధులను సేకరించనున్నాయి.
ఈ వారం IPO మార్కెట్ లో లిస్టింగులు సందడి నెలకొని ఉంది. ఓ వైపు LIC IPO సోమవారంతో ముగియనుంది. కానీ ఈ వారంలో 3 కొత్త ఇష్యూలు తెరుచుకోనున్నాయి. Venus Pipes & Tubes Limited, Prudent Corporate Advisory Services, Delhivery సంస్థలు ఐపీవో ద్వారా ఈ వారం నిధులను సేకరించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంతో పాటు దేశీయ మార్కెట్‌లోనూ పరిస్థితి ఇంకా బాగోలేదు. నిఫ్టీ 16,500 దిగువన ట్రేడవుతోంది. అటువంటి పరిస్థితిలో, IPO లో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం అని నిపుణులు పేర్కొంటున్నారు.
27
మే రెండవ వారంలో, Venus Pipes & Tubes Limited, Prudent Corporate Advisory Services, Delhivery IPOలు తెరుచుకోనున్నాయి. అంటే, ఈ వారం మీ ప్రైమరీ మార్కెట్‌లో పెట్టుబడి కోసం 3 కొత్త ఆప్షన్‌లు ఉంటాయి. ఈ 3 IPOల పరిమాణం దాదాపు 6 వేల కోట్లు ఉంటుంది.
37
Prudent Corporate Advisory Services IPO మే 10న ప్రారంభమవుతుంది. మరుసటి రోజు, Delhivery, Venus Pipes & Tubes Limited IPOలు మే 11న తెరుచుకోనున్నాయి. ఈ మూడు IPOలలో, ముందుగా ప్రారంభమయ్యే ప్రుడెంట్ కార్పొరేట్ IPO పరిమాణం రూ. 538.61 కోట్లు, వీనస్ పైప్స్ & ట్యూబ్స్ IPO రూ. 165.42 కోట్లు మరియు ఢిల్లీవేరీ IPO రూ. 5,235 కోట్లుగా ఉంది.
47
Prudent Corporate Advisory Services IPO:
ఈ IPO 10న ప్రారంభమై మే 12న ముగుస్తుంది. ఇందులో డబ్బు పెట్టుబడి పెట్టడానికి 3 రోజుల సమయం ఉంటుంది. దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 595 నుంచి 630గా నిర్ణయింయారు. దీని వాటాల కేటాయింపు మే 18న జరుగుతుంది. దీని లిస్టింగ్ మే 23న BSE, NSEలలో ఉంటుంది. ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూల అధికారిక రిజిస్ట్రార్‌గా నియమించారు.
57
Delhivery IPO
దేశంలోని ప్రముఖ లాజిస్టిక్ సంస్థ డెలివరీ, రూ. 5,235 కోట్ల IPO మే 11న ప్రారంభమై మే 13న ముగుస్తుంది. దీని ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 462 నుండి 487గా నిర్ణయించారు. షేర్ కేటాయింపు మే 19న జరుగుతుంది. అయితే దీని లిస్టింగ్ మే 24న NSE, BSE రెండింటిలోనూ జరిగే అవకాశం ఉంది. లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాని రిజిస్ట్రార్.
67
Venus Pipes & Tubes Limited
ఇది మే 11న ప్రారంభమై మే 13న ముగిసిపోతుంది. ఈ IPO ఇష్యూ సైజ్ రూ. 165.42 కోట్లుగా నిర్ణయించారు . దీని ప్రైజ్ బ్యాండ్ రూ. 310 నుండి 326గా ఉంది. దీని వాటాల కేటాయింపు మే 19న జరుగుతుంది. దీని లిస్టింగ్ మే 24న జరిగే అవకాశం ఉంది.
77
ప్రస్తుతం మార్కెట్‌లో అనిశ్చితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు భారీ హెచ్చు తగ్గులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా IPOలో డబ్బు పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో IPOలు నష్టాలను మిగిల్చాయి. కొత్త IPO వాల్యుయేషన్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందువల్ల, నిపుణులు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు.