Campus Activewear IPO Listing: క్యాంపస్ యాక్టివ్‌వేర్ IPO సూపర్ హిట్, 23 శాతం ప్రీమియంతో లిస్టింగ్..

Published : May 09, 2022, 12:18 PM IST

సోమవారం మార్కెట్లలో భారీ పతనం నమోదు అవుతున్నప్పటికీ, Campus Activewear IPO మాత్రం 23 శాతం బంపర్ లిస్టింగ్ నమోదు చేసింది. మార్కెట్ల పతనంలోనూ క్యాంపస్ యాక్టివ్‌వేర్ ఐపీఓ షేర్లు  ప్రైస్ బ్యాండ్ ధర రూ.292తో పోల్చితే 68 రూపాయలు ప్రీమియంతో, NSEలో రూ.360 వద్ద లిస్ట్ అయ్యాయి. BSEలో క్యాంపస్ యాక్టివ్‌వేర్ షేర్లు రూ. 355 వద్ద లిస్ట్ అయ్యాయి.

PREV
15
Campus Activewear IPO Listing: క్యాంపస్ యాక్టివ్‌వేర్ IPO సూపర్ హిట్, 23 శాతం ప్రీమియంతో లిస్టింగ్..

క్యాంపస్ యాక్టివ్‌వేర్ షేర్లు మార్కెట్‌లో భారీ పతనంలోనూ దాని IPO ధరపై 23 శాతం ప్రీమియంతో సోమవారం NSEలో లిస్టయ్యాయి. దీంతో IPO ధర రూ. 292తో పోల్చితే రూ. 360 వద్ద NSEలో జాబితా అయ్యాయి. అదే సమయంలో, BSEలో క్యాంపస్ యాక్టివ్‌వేర్ షేర్లు రూ. 355 వద్ద లిస్ట్ అయ్యాయి.
 

25

ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కారణంగా స్పోర్ట్స్‌వేర్ కంపెనీ IPO సబ్‌స్క్రిప్షన్ చివరి రోజున 51.75 శాతం సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. క్యాంపస్ IPO  GMP కూడా అదే ప్రీమియం వైపు చూపడం గమనించదగ్గ విషయం. క్యాంపస్ యాక్టివ్‌వేర్ యొక్క IPO పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద కేటాయించారు. దీని ప్రమోటర్లు మరియు వాటాదారులు 4,79,50,000 షేర్లను మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. జారీ చేసినవారిలో ప్రమోటర్లు హరి కృష్ణ అగర్వాల్, నిఖిల్ అగర్వాల్, అలాగే ప్రస్తుత వాటాదారులు TPG గ్రోత్ III SF Pte Ltd, QRG ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, రాజీవ్ గోయల్, రాజేష్ కుమార్ గుప్తాలు ఉన్నారు. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,400 కోట్లు సమీకరించింది.
 

35

IPO ధర శ్రేణి రూ. 278 నుండి 292గా నిర్ణయించగా. పబ్లిక్ ఆఫర్‌కు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.418 కోట్లు అందుకుంది. JM ఫైనాన్షియల్, BofA సెక్యూరిటీస్ ఇండియా, CLSA ఇండియా మరియు కోటక్ మహీంద్రా క్యాపిటల్ ఈ పబ్లిక్ ఆఫర్‌కు మేనేజర్‌లుగా ఉన్నాయి. ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇది ఏప్రిల్ 26-28 మధ్య 51 సార్లు సభ్యత్వం పొందింది. QIBల రిజర్వ్ షేర్ 152 రెట్లు, NIIలకు 22.25 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది, రిటైల్ ఇన్వెస్టర్ల షేర్ 7.68 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.

45

క్యాంపస్ యాక్టివ్ వేర్ 2005లో క్యాంపస్ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇది ఫుట్ వేర్ వ్యాపారంలో మంచి మార్కెట్ స్థానం సంపాదించింది. ఇది యువతకు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారికి ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది. FY21లో క్యాంపస్ మార్కెట్ వాటా 17 శాతం.

55

స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా మాట్లాడుతూ, ప్రతికూల మార్కెట్ పరిస్థితులలో కూడా, కంపెనీ వ్యాపారం ఎంత బలంగా ఉందో లిస్టింగ్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.  క్యాంపస్ యాక్టివ్‌వేర్ అనేది భారతీయ స్పోర్ట్స్ మార్కెట్‌లో ప్రముఖ దేశీయ బ్రాండ్. సంతోష్ మీనా ప్రకారం, అతను ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు, కొత్త పెట్టుబడిదారులకు లాంగ్ టర్మ్ లో  పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories