Google Pay ద్వారా రూ. 1 లక్ష రుణం పొందండిలా..ఈ ఒక్క పని చేస్తే చాలు కాలుకదపకుండానే లోన్...

Published : May 07, 2022, 10:31 PM IST

Loan from Google Pay: మీరు రూ. 1 లక్ష వరకు తక్షణ రుణం తీసుకోవాలనుకుంటే, మీరు Google Pay ద్వారా ఈ అవసరాన్ని తీర్చుకోవచ్చు. మీ పేమెంట్ వాలెట్ ఎలా రుణాన్ని అందించగలదో తెలుసుకోండి.

PREV
16
Google Pay ద్వారా రూ. 1 లక్ష రుణం పొందండిలా..ఈ ఒక్క పని చేస్తే చాలు కాలుకదపకుండానే లోన్...

కొన్నిసార్లు మీకు డబ్బు అత్యవసరం అవుతుంది. ఆ సమయంలో  మీరు బ్యాంకుల నుండి చాలా ఎక్కువ రేట్లకు వ్యక్తిగత రుణాలను పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు సరికొత్త మార్గం వచ్చింది, దీని ద్వారా మీకు వెంటనే రూ. 1 లక్ష వరకు రుణం లభిస్తుంది. అది కూడా మనం నిత్యం వాడే Google Pay నుంచి అని తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. కానీ మీరు విన్నది నిజమే. ఈ పేమెంట్స్ యాప్ ద్వారా  మీరు రూ. 1 లక్ష వరకు వ్యక్తిగత రుణాన్ని  పొందవచ్చు.

26
కొత్త ఫీచర్ ఏంటి, ఎలా సాధ్యమైంది?

వాస్తవానికి, Google Pay DMI ఫైనాన్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భాగస్వామ్యం కింద, రెండు కంపెనీలు సంయుక్తంగా డిజిటల్ వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి.

36
రుణం ఎంత లభిస్తుంది - ఎలా తిరిగి చెల్లించాలి

మీరు Google Pay ద్వారా డిజిటల్‌గా రూ. 1 లక్ష వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. దీనిని 36 నెలలు లేదా గరిష్టంగా 3 సంవత్సరాల వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. ప్రస్తుతం, ఈ సదుపాయం DMI ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో దేశంలోని 15,000 పిన్ కోడ్‌లలో అందుబాటులో ఉంటుంది.

46
Google Pay నుండి రుణం తీసుకోవడానికి షరతులు ఏమిటి

ఈ లోన్ తీసుకోవడానికి, కస్టమర్ Google Payలో కస్టమర్‌గా ఉండాలి. క్రెడిట్ హిస్టరీ బాగుండాలి, అప్పుడు మాత్రమే ఈ లోన్ అందుబాటులో ఉంటుంది. 

56
మంచి క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండటం ముఖ్యం.

ప్రీ-క్వాలిఫైడ్ అర్హత కలిగిన వినియోగదారులు DMI ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఈ లోన్ తీసుకోగలరు. లోన్ Google Pay ద్వారా అందించబడుతుంది.

66
ఎంతకాలం డబ్బు వస్తుంది

ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్‌లు ఉన్నట్లయితే, కస్టమర్ లోన్ అప్లికేషన్ రియల్ టైమ్‌లో ప్రాసెస్ చేయబడుతుంది. కొంత సమయం తర్వాత మీరు అప్లై చేసిన ఖాతాలో రూ. 1 లక్ష వరకు రుణం పొందుతారు.

click me!

Recommended Stories