ఇంత తక్కువ ధరకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ లభించదేమోా

First Published | Dec 13, 2024, 8:54 PM IST

చిన్న వాళ్లు, పెద్ద వాళ్లు ఎవ్వరైనా ఉపయోగించే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? అయితే అవాన్ ఈ-లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోండి. కేవలం రూ.32,420కే మార్కెట్లో అందుబాటులో ఉంది. చిన్న చిన్న అవసరాలు తీర్చే ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

చీప్ అండ్ బెస్ట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని మీరు ఎదురు చూస్తున్నారా? మీ ఆలోచనకు తగ్గట్టుగా ఉండే చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని అవాన్ కంపెనీ తీసుకొచ్చింది. ఇది కేవలం రూ. 32,420 ధరతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ప్రతిరోజూ ప్రయాణించడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ స్కూటర్ నగరంలో తిరగడానికి చాలా బాగుంటుంది. పల్లెల్లో అయినా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 

అవాన్ అనేది సైకిళ్లను తయారు చేసి విక్రయించే కంపెనీ. ఈ కంపెనీ పర్యావరణాన్ని కాపాడాలన్న కాన్సెప్ట్ తో పని చేస్తుంది. అందుకే పొల్యూషన్ క్రియేట్ చేయని సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి విక్రయిస్తుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే E స్కూట్ 504, E మేట్ 306 లాంటి పలు ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలై మార్కెట్ లో మంచి ఆదరణ పొందుతున్నాయి. 

Tap to resize

Avon E-Lite విషయానికొస్తే తేలికైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గేర్డ్ వీల్ ఇన్‌కార్పొరేటెడ్, BLDC 230W మోటార్‌ ద్వారా పనిచేస్తుంది. ఇది 48V 12AH, LA సీల్డ్ మెయింటెనెన్స్ ఫ్రీ రీఛార్జ్ చేసే కెపాసిటీ ఉన్న బ్యాటరీ వల్ల నడుస్తుంది. 

ఈ-లైట్ ఫీచర్లు

ఈ స్కూటర్ పై ప్రయాణం చాలా సింపుల్ గా ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండటంతో కాస్త దూర ప్రయాణాలకు కూడా సౌకర్యంగానే ఉంటుంది. ఈ స్కూటర్ లో నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి ఎలక్ట్రానిక్ పవర్, పెడల్, పెడల్ అసిస్ట్ విత్ ఎలక్ట్రానిక్ పవర్, క్రూయిజ్ కంట్రోల్. భద్రత కోసం పాస్ స్విచ్ కూడా ఉంది.

ప్రైస్, కెపాసిటీ

Avon E-Lite గంటకు 24 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే 50 కి.మీ. వెళ్తుంది. 0.23 kWh బ్యాటరీ, BLDC మోటార్‌తో పనిచేస్తుంది. అందువల్ల ఈ స్కూటర్ రోజువారీ అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది. 

ఈ స్కూటర్ 80 కిలోల వరకు బరువు మోయగలదు. దీనిపై ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణించవచ్చు. హాలోజన్ హెడ్‌లైట్, సాధారణ బల్బ్ టెయిల్‌లైట్లు, ఇండికేటర్ల వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Avon E-Lite స్కూటర్ కి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ABS లేకపోయినా అల్లాయ్ వీల్స్, ట్యూబ్ టైర్లతో దీన్ని తయారు చేశారు. ఈ స్కూటర్ రూ. 32,420 ధరతో మార్కెట్ లో అందుబాటులో ఉన్నా కొంత మంది డీలర్ల దగ్గర ఇంకా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ స్కూటర్ ఎక్కువగా నగరంలో తిరగడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది.  

Latest Videos

click me!