TV Prices: పండ‌క్కి టీవీ, ఫ్రిజ్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? మీకో బ్యాడ్ న్యూస్

Published : Sep 27, 2026, 09:42 PM IST

TV Prices: ఈసారి పండ‌క్కి కొత్త టీవీ, ఫ్రిజ్ కొనుగోలు చేసే ఆలోచ‌న చేస్తున్న వారికి ఓ బ్యాడ్ న్యూస్‌. ప‌లు కార‌ణాల‌తో టీవీ, ఏసీ, ఫ్రిజ్ వంటి వ‌స్తువుల ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.

PREV
15
ఏసీ, టీవీలు మరింత ప్రియం

పండగల సీజన్‌ ప్రారంభానికి ముందే గృహోపకరణాల కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెంపు రూపంలో ఊహించని భారం ఎదురవుతోంది. కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ రంగంలోని పలు ప్రముఖ సంస్థలు ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు సహా వివిధ ఉత్పత్తుల ధరలను సవరించాయి. అక్టోబర్‌ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఉత్పత్తిని బట్టి సుమారు 3 నుంచి 10 శాతం వరకు పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

25
ముడిసరకుల ధరలే ప్రధాన కారణం

ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే కాపర్‌, స్టీల్‌, ప్లాస్టిక్‌ వంటి ముడిపదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం కూడా పెరిగిందని కంపెనీలు చెబుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్‌ ధరల మార్పులు, పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా సరఫరా వ్యయంపై ప్రభావం చూపుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు దిగుమతి ఆధారిత భాగాల ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

35
ఏసీలపై ఎక్కువ ప్రభావం

ధరల పెంపు ప్రభావం ప్రధానంగా ఎయిర్‌ కండిషనర్లపై కనిపిస్తోంది. కొన్ని కంపెనీలు ఏసీ ధరలను 5 నుంచి 8 శాతం వరకు పెంచాయి. బ్లూ స్టార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.త్యాగరాజన్‌ ప్రకారం కాపర్‌, ప్లాస్టిక్‌, స్టీల్‌ ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలను సవరించాల్సి వచ్చింది. గత ఏడాది పండగ సీజన్‌తో పోలిస్తే తమ ఉత్పత్తుల ధరలు దాదాపు 15 శాతం మేర పెరిగినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆ సంస్థ ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

45
టీవీలు, వాషింగ్‌ మెషిన్లకు కూడా పెంపు

ఏసీలతో పాటు ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషిన్లు, ఫ్రిజ్‌ల ధరల్లోనూ మార్పు వచ్చింది. వీటి ధరలు సాధారణంగా 2 నుంచి 4 శాతం వరకు పెరిగాయి. గోద్రెజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌ బిజినెస్‌ విభాగానికి చెందిన కమల్‌ నంది మాట్లాడుతూ ముడిసరకుల వ్యయం 8 నుంచి 10 శాతం వరకు పెరిగిందని తెలిపారు. దీంతో వివిధ ఉత్పత్తుల ధరలను దాదాపు 5 నుంచి 7 శాతం వరకు దశలవారీగా పెంచుతున్నట్లు వెల్లడించారు. హైయర్‌ ఇండియా కూడా టీవీలు, వాషింగ్‌ మెషిన్లు సహా పలు ఉత్పత్తుల ధరలను 2 నుంచి 3 శాతం మేర పెంచినట్లు తెలిపింది.

55
దీపావళి వరకు పాత ధరలకు అవకాశం

ధరలు పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించినప్పటికీ వెంటనే అన్ని ఉత్పత్తులపై కొత్త రేట్లు కనిపించకపోవచ్చు. ఇప్పటికే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద పాత ధరలకు కొనుగోలు చేసిన స్టాక్‌ అందుబాటులో ఉంది. అందువల్ల ఆ సరకు పూర్తయ్యే వరకు కొన్ని ఏసీలు, టీవీలు, ఇతర గృహోపకరణాలు పాత ధరలకే లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా దీపావళి వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కొత్త ధరలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ముడిసరకుల ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే వచ్చే ఏడాది కూడా మరిన్ని ధరల పెంపులు తప్పకపోవచ్చని హైయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎన్‌.ఎస్‌.సతీష్‌ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి వరకు దశలవారీగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories