PM Suraksha Bima Yojana: రూ.20 లకే రూ.2 లక్షల ఇన్సూరెన్స్.. రూల్స్, అర్హతలు ఇవే

Published : Sep 27, 2026, 01:18 PM IST

PM Suraksha Bima Yojana: కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఏడాదికి కేవలం రూ.20 లకే రూ.2 లక్షల వరకు ప్రమాద ఇన్సూరెన్స్ లభిస్తుంది. పూర్తి వివరాలు మీకోసం.

PREV
15
సంవత్సరానికి రూ. 20 కడితే రూ. 2 లక్షల ఇన్సూరెన్స్.. ఈ గవర్నమెంట్ స్కీమ్ గురించి తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో రకాల సామాజిక భద్రతా పథకాలను అందుబాటులోకి తెచ్చింది. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం 'ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన' (PMSBY). ఈ పథకంలో సంవత్సరానికి కేవలం రూ.20 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

అంటే నెలకు రూ.2 కంటే తక్కువ ఖర్చుతో రూ.2 లక్షల వరకు ప్రమాద రక్షణ బీమా కవరేజ్ లభిస్తుంది. ప్రమాదవశాత్తు లబ్ధిదారుడు మరణిస్తే వారి నామినీకి లేదా కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ఈ బీమా పాలసీని తీసుకోవడానికి ఎలాంటి మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు.

25
అర్హత వయస్సు, ఇతర రూల్స్ ఇవే

18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతీ ఒక్కరూ ఈ పథకానికి అర్హులు. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉన్నవారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నప్పటికీ, ఆయన కేవలం ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. అదే జాయింట్ అకౌంట్ ఉన్న సందర్భంలో, ఖాతాదారులు అందరూ తమ తమ వాటాగా చెరొక రూ.20 ప్రీమియం చెల్లించి ఈ బీమా కవరేజ్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

35
ప్రీమియం చెల్లింపు, కవరేజ్ కాలపరిమితి

ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రీమియం అమౌంట్ కట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ నుండి ‘ఆటో-డెబిట్’ ఆప్షన్ ద్వారా ఏడాదికి రూ.20 నేరుగా కట్ అవుతుంది. ఈ బీమా కవరేజ్ కాలపరిమితి ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి ప్రారంభమై మే 31 వరకు అమల్లో ఉంటుంది.

మొదట్లోనే ఈ స్కీమ్‌లో చేరలేకపోయిన వారు, సంవత్సరం మధ్యలో కూడా నిర్ణీత ప్రీమియం చెల్లించి జాయిన్ కావచ్చు. అయితే ప్రీమియం డబ్బులు అకౌంట్ నుండి కట్ అయిన తేదీ నుంచే రిస్క్ కవర్ వర్తిస్తుంది. భారతదేశంలో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఈ కవర్ పొందవచ్చు. కానీ క్లెయిమ్ అమౌంట్ మాత్రం కేవలం భారతీయ రూపాయిలలోనే చెల్లిస్తారు.

45
ప్రమాదాలు రూల్స్ ఇవే

ఈ పథకంలో అనుకోకుండా లేదా ఊహించని విధంగా జరిగే బాహ్య ప్రమాదాలను కవర్ చేస్తారు. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే మరణాలు లేదా అంగవైకల్యానికి క్లెయిమ్ లభిస్తుంది. అలాగే హత్య జరిగిన కేసులలో కూడా బీమా అమౌంట్ లభిస్తుంది.

కానీ ఆత్మహత్య చేసుకున్న సందర్భాలలో ఈ పథకం కింద ఎలాంటి బీమా ప్రయోజనాలు వర్తించవు. అకౌంట్ హోల్డర్‌కు 70 ఏళ్లు నిండినా, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ క్లోజ్ అయినా, అలాగే అకౌంట్‌లో ప్రీమియం కట్ కావడానికి తగినంత బ్యాలెన్స్ లేకపోయినా ఈ బీమా రద్దవుతుంది.

55
క్లెయిమ్ ప్రాసెస్, ఆసుపత్రి ఖర్చులు

ఈ ప్రమాద బీమా పథకం కింద ఆసుపత్రిలో చేరితే అయ్యే మెడికల్ ఖర్చులను చెల్లించరు. ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే క్లెయిమ్ అమౌంట్ నామినీ లేదా చట్టబద్ధమైన వారసుల బ్యాంక్ అకౌంట్‌కు చేరుతుంది. అంగవైకల్యం సంభవిస్తే ఆ డబ్బు నేరుగా బాధితుడి అకౌంట్‌లో జమ అవుతుంది.

రోడ్డు, రైలు, వాహన ప్రమాదాలు, నీటిలో మునిగిపోవడం లేదా నేరపూరిత సంఘటనల మరణాలకు పోలీస్ రిపోర్ట్ లేదా ఎఫ్ఐఆర్ తప్పనిసరి. అయితే పాము కాటు, చెట్టుపై నుంచి పడటం వంటి ప్రమాదాలకు ఆసుపత్రి మెడికల్ రికార్డుల ఆధారంగా క్లెయిమ్ ప్రాసెస్ చేస్తారు. ఈ పథకంలో చేరేందుకు మీ బ్యాంక్ బ్రాంచ్ లేదా బీమా కంపెనీలను సంప్రదించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories