Low price 7 seater: రూ.5.76 లక్షలకే 7 సీటర్ కారు.. పాతికవేల కుటుంబాలు కొన్న కారు ఇది

Published : Apr 20, 2026, 02:17 PM IST

Low price 7 seater: అతి తక్కువ ధరలో వచ్చే 7 సీటర్ కారు ఇది. మనదేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఈ కారు ఎంతో ఎఫర్డబుల్.  ఈ కారు పేరు రెనాల్ట్ ట్రైబర్. ఫ్లెక్సిబుల్ సీటింగ్, 18 నుంచి 20 కి.మీ మైలేజ్, 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ వంటి ఫీచర్లు దీని సొంతం.

PREV
14
తక్కువ ధరలో 7 సీటర్ కారు

మనదేశంలోని మధ్యతరగతి కుటుంబాల కోసం వచ్చిన కారు రెనాల్డ్ ట్రైబర్.  కారు అనేది ఇప్పుడు మనదేశంలో కేవలం వాహనం కాదు, అదొక ఎమోషన్. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండే మన దేశంలో 7 సీట్ల కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో సెవెన్ సీటర్ కార్ కావాలనుకుంటే రెనాల్ట్ ట్రైబర్ సరైన ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

24
మధ్యతరగతి కుటుంబాల కోసమే

ఇండియన్ మార్కెట్‌లోని ఎంపీవీ సెగ్మెంట్‌లో రెనాల్ట్ ట్రైబర్ ను ఎన్నో కుటుంబాలు ఇష్టపడుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలోనే 25,000 యూనిట్లకు పైగా అమ్ముడైంది ఈ కారు.  ప్రతినెలా వేలాది కుటుంబాలు ఈ కారును కొంటున్నాయి. మార్కెట్లో ఖరీదైన మోడల్స్ ఉన్నప్పటికీ, తక్కువ ధరకే లభిస్తుండటంతో చాలామంది ట్రైబర్‌నే ఎంచుకుంటున్నారు.

34
రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లు

బయటి నుంచి చూస్తే ఈ కారు ఒక చిన్న సైజు ఎస్‌యూవీలా కనిపిస్తుంది. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు దీనికి స్టైలిష్ లుక్ ఇస్తాయి. ఇది 4 మీటర్ల లోపు కారే అయినా, లోపల మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నడపడానికి చాలా అనువుగా ఉంటుంది.

ఈ కారులో అతిపెద్ద బలం దాని ఫ్లెక్సిబుల్ సీటింగ్ సిస్టమ్. అవసరం లేనప్పుడు మూడో వరుస సీట్లను పూర్తిగా తీసేయొచ్చు. దీనివల్ల ప్రయాణికులు తక్కువగా ఉన్నప్పుడు, లగేజీ కోసం ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా కారును మార్చుకునే ఈ సౌకర్యం కుటుంబాలకు చాలా ఉపయోగపడుతుంది.

44
రెనాల్ట్ ట్రైబర్ ధర
1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు సిటీ డ్రైవింగ్‌కు మంచి అనుభూతిని ఇస్తుంది. లీటర్‌కు 18-20 కి.మీ వరకు మైలేజ్ రావడం ప్రస్తుత పెట్రోల్ ధరల వద్ద పెద్ద ప్లస్ పాయింట్. భద్రత విషయంలోనూ రాజీ లేదు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో 4-స్టార్ రేటింగ్ పొందింది. దీని ప్రారంభ ధర కేవలం రూ.5.76 లక్షలు మాత్రమే. తక్కువ ఖర్చుతో మంచి 7-సీటర్ ఫ్యామిలీ కారు కోసం చూసేవారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
Read more Photos on
click me!

Recommended Stories