Business Ideas: అల్లాటప్పా కాదు ఆల్‌రౌండ్ వ్యాపారాలు.! తక్కువ పెట్టుబడితో ఇప్పుడే స్టార్ట్ చేసేయండి..

Published : Apr 20, 2026, 10:00 AM IST

Business Ideas: రూ. 1 లక్షలోపు పెట్టుబడితో ప్రారంభించగలిగే ఫోటోగ్రఫీ, వాటర్ బాటిల్ బిజినెస్, హోమ్ బేకరీ, ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటి లాభదాయకమైన వ్యాపార ఆలోచనలను ఇప్పుడు తెలుసుకుందామా. తక్కువ ఖర్చుతో సొంతంగా వ్యాపారం.. 

PREV
15
డ్రాప్ షిప్పింగ్ (Drop Shipping)

ఎలాంటి స్టాక్ నిల్వ లేకుండా ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లకు, సెల్లర్లకు మధ్య వారధిగా ఉంటూ కమిషన్ పొందవచ్చు. దీనికి డిజిటల్ మార్కెటింగ్ మీద పట్టు ఉండటం అవసరం.

25
హోమ్ బేకరీ (Home Bakery)

ఇంట్లో ఉండే ఓవెన్, ఫ్రిజ్ వంటి వాటితోనే బేకరీ ఐటమ్స్ తయారు చేసి అమ్మవచ్చు. పార్టీలు, పుట్టినరోజు వేడుకలకు కస్టమైజ్డ్ కేక్స్ అందించడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించవచ్చు.

35
వాటర్ బాటిల్ బిజినెస్ (Water Bottle Business)

వాటర్ ప్లాంట్లతో టై అప్ అయ్యి మీ సొంత బ్రాండింగ్‌తో వాటర్ బాటిల్స్ పంపిణీ చేయవచ్చు. లేదా చిన్న స్థలంలో రూ. 80,000 లోపు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల వారికి వాటర్ కాయిన్ సర్వీస్ అందించవచ్చు.

45
ఫోటోగ్రఫీ (Photography)

మంచి కెమెరా కొనుగోలు చేసి ఫోటోగ్రఫీ సర్వీసెస్ ప్రారంభించవచ్చు. మొదట ప్రొఫెషనల్ కోర్సు చేయడం లేదా ఎవరి దగ్గరైనా ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల మెలకువలు నేర్చుకోవచ్చు.

55
ఈవెంట్ మేనేజ్మెంట్(Event Management)

చిన్నచిన్న ఫంక్షన్లు, బర్త్ డే పార్టీల నిర్వహణ బాధ్యత తీసుకోవడం ద్వారా ఈ వ్యాపారం చేయవచ్చు. లైటింగ్, సౌండ్, డెకరేటర్లతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని ఈవెంట్లను హోస్ట్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: ఏ వ్యాపారమైనా ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టకుండా, బేసిక్ లెవల్ నుండి ప్రారంభించి మెల్లగా పెంచుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories