లాక్ డౌన్ తరువాత హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోండి..

First Published May 14, 2021, 3:24 PM IST

కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా ప్రజలు తమ ఇళ్లకే  పరిమితం కావాల్సివస్తుంది. కానీ లాక్ డౌన్  సడలించిన తరువాత ప్రజలు ఇంతకుముందుల బయటికి వెళ్లవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. సామాజిక దూరం, సానిటైజేషన్, ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. 

ఇలాంటి పరిస్థితిలో మీరు లాక్ డౌన్ తరువాత షాపింగ్ కోసం హైదరాబాద్ సందర్శించాలనుకుంటే అక్కడ ఉన్న కొన్ని ఫేమస్ మార్కెట్ల గురించి తెలుసుకోండి...
undefined
మొజామ్ జాహి మార్కెట్హైదరాబాద్‌లో ఉన్న ఈ మొజామ్ జాహి మార్కెట్ కు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మొజమ్ జా బహదూర్ పేరు పెట్టారు. ఈ మార్కెట్ ముఖ్యంగా పండ్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రజలు దూర ప్రాంతాల నుండి పండ్లు కొనడానికి వస్తారు. అంతేకాదు డ్రై ఫ్రూట్స్, పరిమళ సుగంధ ద్రవ్యాలు, చికెన్, మేక మాంసం కూడా ఇక్కడ లభిస్తాయి.
undefined
బేగం బజార్బేగం బజార్ హైదరాబాద్ లోని ప్రసిద్ధ మార్కెట్లలో ఒకటి. సుమారు 150 సంవత్సరాల పురాతనమైనది. మీరు హైదరాబాద్ సందర్శించాలనుకుంటే ఇక్కడకు వెళ్లడం మర్చిపోవద్దు. ఇక్కడ నుండి మీరు అలంకరణ వస్తువులు, పరిమళ ద్రవ్యాలు, స్థానిక వస్తువులు, ఆభరణాలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు.
undefined
లాడ్ బజార్చురి బజార్ అని కూడా పిలువబడే ఈ లాడ్ బజార్ హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలో ఉంది. ప్రత్యేకంగా, మహిళలకు కావల్సిన వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి. గాజులు, కృత్రిమ ఆభరణాలు, పట్టు చీరలు, పరిమళ ద్రవ్యాలు, పాత్రలు తక్కువ ధరకు లభిస్తాయి. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా ఈ మార్కెట్‌ను సందర్శిస్తారు.
undefined
కోటిమార్కెట్హైదరాబాద్‌లో ఉన్న కోటి బజార్ బ్రిటిష్ పాలన నుండి ప్రసిద్ధి చెందింది. ఈ మార్కెట్‌ను రెసిడెన్సీ మార్కెట్ అని కూడా అంటారు. ఇక్కడ మీరు హ్యాండ్‌బ్యాగులు, పాదరక్షలు, ఆభరణాలు, గృహోపకరణాలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు.
undefined
click me!