దేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. భారతదేశంలోనే ప్రతి నెల కనీసం 10 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. అన్ని కంపెనీలు వాటి ఫోన్‌ల గురించి రకరకాల క్లెయిమ్‌లు చేస్తుంటాయి ఇంకా వాటిని బెస్ట్ అని చేబుతాయి , అయితే రియాలిటీ వినియోగదారుల చేతుల్లో ఉంటుంది.
smartphones
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ లో మొదటి పేరు iPhone 14 Pro Max. ఈ ఆపిల్ ఫోన్ అత్యంత ఖరీదైన ఐఫోన్. అలాగే 2023 మొదట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఫోన్. రెండవ ఇంకా మూడవ స్థానంలో iPhone 14 Pro ఇంకా iPhone 13 ఉన్నాయి.
మొత్తంగా 65 కోట్ల ఆపిల్ స్మార్ట్‌ఫోన్ యూనిట్లు విక్రయించగా, ఇందులో ఐఫోన్ 13 1.55 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆండ్రాయిడ్ గురించి మాట్లాడితే ఈ విభాగంలో శామ్‌సంగ్ టాప్ లో ఉంది. గణాంకాల ప్రకారం శామ్‌సంగ్ 55 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి.
Samsung Galaxy A13 టాప్-5లో ఉంది. ఈ ఫోన్ 1. 24 కోట్ల మంది కొనుగోలు చేశారు. గతేడాది ఈ ఫోన్ సేల్స్ 1.62 కోట్లు. గత సంవత్సరం షియోమీ Redmi సిరీస్ ఫోన్‌లు ఈ లిస్ట్ లో ఉండగా అయితే ఈసారి లేదు.