Smart phones: గేమింగ్ ఫీచర్స్ ఉన్న ఇంత మంచి స్మార్ట్ ఫోన్ల ధర.. రూ.15 వేల కంటే తక్కువేనా?

Published : Mar 14, 2025, 10:45 AM IST

Smart phones: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మంచి కెమెరాలు, ఎక్కువ బ్యాటరీ లైఫ్, చక్కటి పనితీరు కలిగిన స్మార్ట్ ఫోన్లు రూ.15 వేల కంటే తక్కువకే దొరుకుతున్నాయి. బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

PREV
15
Smart phones: గేమింగ్ ఫీచర్స్ ఉన్న ఇంత మంచి స్మార్ట్ ఫోన్ల ధర.. రూ.15 వేల కంటే తక్కువేనా?

పోకో M7 ప్రో (Poco M7 Pro):
పోకో M7 ప్రో సింపుల్‌గా ఉంటూనే మంచి పనితీరును అందిస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 8GB RAM, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ఉండటం వల్ల గేమ్స్ ఆడటం ఈజీ. ఇందులో రోజంతా ఛార్జింగ్ వచ్చే 5,110mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటం వల్ల త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. 

25

CMF ఫోన్ 1 (CMF Phone 1):

నథింగ్ కంపెనీ CMF ఫోన్ 1 తక్కువ ధరలో మంచి ఫీచర్లతో మార్కెట్ లో లభిస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఉండటం వల్ల రోజువారీ పనులు స్మూత్‌గా ఉంటాయి. 6.67 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉండటం వల్ల వీడియోలు చూడటానికి బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా పగటి వెలుతురులో మంచి పిక్చర్స్ తీస్తుంది. 5,000mAh బ్యాటరీ ఎక్కువసేపు ఛార్జింగ్ ఇస్తుంది.

35

రెడ్‌మి 13 (Redmi 13):

రెడ్‌మి 13 5G ఫోన్.. రెడ్‌మి 12 5G కంటే చాలా బాగుంటుంది. 120Hz LCD డిస్‌ప్లే ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమ్స్ ఆడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండటం వల్ల మంచి పిక్చర్స్ తీయొచ్చు. రెడ్‌మి 13 తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వస్తుంది. ఇది పనితీరు, డిస్‌ప్లే విషయంలో బెస్ట్ ఫోన్.

45

మోటరోలా G64 (Motorola G64):

స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి మోటరోలా G64 5G ఫోన్ మంచి ఆప్షన్. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ ఉండటం వల్ల గేమ్స్ ఆడటం స్మూత్‌గా ఉంటుంది. 6,000mAh బ్యాటరీ ఉండటం వల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వస్తుంది.

iQOO Z9x (iQOO Z9x):

iQOO Z9xలో 6.72 అంగుళాల LCD స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 CPU, 4GB/8GB/12GB RAM ఉన్నాయి. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000 mAh బ్యాటరీ ఉంది. 50MP మెయిన్ కెమెరా ఉంది.

55

వివో T4x (Vivo T4x):

వివో T4x 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 8GB RAMతో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 CPU ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంది. 6500 mAh బ్యాటరీ ఉండటం వల్ల ఎక్కువ బ్యాటరీ లైఫ్ వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 (Infinix Note 40):

ఇన్ఫినిక్స్ నోట్ 40లో 6.78 అంగుళాల పూర్తి HD+ అమోల్డ్ స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. OISతో 108MP మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32MP కెమెరా ఉంది. 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 33W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

click me!

Recommended Stories