తత్కాల్ టిక్కెట్స్ స్పీడ్ గా బుక్ చేయాలంటే 5 టిప్స్ ఇవిగో..

First Published | Nov 20, 2024, 10:58 AM IST

మీరు ఎక్కువగా ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటారా? అప్పటికప్పుడు టిక్కెట్స్ కావాలంటే తత్కాల్ ఒక్కటే ఆప్షన్ కదా.. అయితే తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల టిక్కెట్స్ కన్ఫర్మ్ కావు. వెయిటింగ్ లిస్టులో పడితే జర్నీ టైమ్ వరకు టెన్షన్ తప్పదు. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ఈ 5 టిప్స్ పాటించండి. దీని వల్ల మీరు స్పీడ్ గా తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు. 
 

మీరు ఎప్పుడు తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసినా IRCTC మొబైల్ యాప్ ను ఉపయోగించండి. ఈ ఐఆర్‌సీటీసీ యాప్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవి మీకు తత్కాల్ టిక్కెట్స్ స్పీడ్ గా బుక్ చేయడానికి ఉపయోగపడతాయి. కాని చాలా మందికి ఈ ఆప్షన్స్ గురించి తెలియదు. అందువల్ల తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేయడంలో ఆలస్యం జరిగి టిక్కెట్స్ కన్ఫర్మ్ కావు. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు తత్కాల్ టిక్కెట్స్ బుక్  చేసినా IRCTC అఫీషియల్ యాప్ మాత్రమే ఉపయోగించండి. 
 

1. IRCTC యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాక more ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది హోమ్ పేజీలో అడుగున, చివర ఉంటుంది. ఈ మోర్ ఆప్షన్ పై క్లిక్ చేసి అక్కడ ఉన్న ఆప్షన్స్ లో Biometric Authenticationను ఆన్ చేసి పెట్టండి. 

ఇలా చేయడం వల్ల లాగిన్ చేసేటప్పుడు మీరు క్యాప్చా కాని, ఓటీపీ కాని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల మీకు చాలా సమయం కలిసి వస్తుంది. తత్కాల్ టిక్కెట్స్ అంటేనే వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఓటీపీ, క్యాప్చా ఎంటర్ చేస్తూ టైమ్ వేస్ట్ చేయకుండా ఉండటానికి బయోమెట్రిక్ అథంటికేషన్ ఆన్ చేసి పెట్టుకోవడం చాలా ముఖ్యం. 


2. రెండో టిప్ ఏంటంటే.. IRCTC యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాక హోమ్ పేజీ అడుగున ఉన్న ఆప్షన్స్ లో Account ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇందులో My Master Listలో మీరు టిక్కెట్స్ బుక్ చేయాలనుకున్న వారి డీటైల్స్ ముందుగానే ఫిల్ చేసి పెట్టుకోండి. అంటే పేరు, వయసు, జండర్ వంటి వివరాలు ముందుగానే పూర్తి చేసి పెట్టుకోవచ్చు. 

దీని వల్ల తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసే టైమ్ లో ప్రయాణికుల వివరాలు ఫిల్ చేయక్కర లేదు. దీని వల్ల మీకు టైమ్ సేవ్ అవుతుంది. 

3. సాధారణంగా తత్కాల్ టిక్కెట్ బుక్ చేయాలంటే మీరు వేగంగా పనిచేయాలి. కాని అదొక్కటే సరిపోదు. మీరు వేగంగా డీటైల్స్ ఎంటర్ చేయాలంటే మీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా స్పీడ్ గా ఉండాలి. మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఎంత స్పీడ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి Ping Test చేయండి. గూగుల్ లో పింగ్ టెస్క్ అని టైప్ చేసి meter.net వెబ్ సైట్ ఓపెన్ చేసి Ping Test చేయండి. 

దీని వల్ల మీ ఇంటర్నెట్ ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తోందో మీకు అర్థమవుతుంది. మీ పింగ్ వాల్యూ 100 మిల్లీ సెకన్స్ కంటే ఎక్కువగా ఉంటే మీ ఇంటర్నెట్ బాగా లేనట్టు లెక్క. మీరు అర్జెంట్ గా ప్లేస్ మారి ఇంటర్నెట్ సిగ్నల్స్ బాగా ఉన్న చోటకు వెళ్లి టిక్కెట్స్ బుక్ చేయండి. 

4. టిక్కెట్స్ బుక్ చేసే టైమ్ లో passenger details లో other preference ఆప్షన్స్ లో consider for auto upgradation ఆప్షన్ టిక్ చేసి ఉంచుకోండి. 

దీని వల్ల మీరు స్లీపర్ క్లాస్ బుక్ చేస్తుంటే ఏసీ క్లాస్ లో ఖాళీలు ఉంటే మీరు సమాచారం వస్తుంది. మీకు కావాలంటే మీ టిక్కెట్ ఏసీ క్లాస్ లోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 

5. మీకు ట్రావెలింగ్ టైమ్ లో ఏమైనా సమస్యలు ఉంటే 139కి కాల్ చేసి కంప్లయింట్ చేయండి. 

ఈ టిప్స్ ఫాలో అయితే తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. త్వరగా టిక్కెట్స్ బుక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. 
 

Latest Videos

click me!