మీరు కోటీశ్వరులు కావాలంటే 12x30x12 ఫార్ములా ఫాలో అయిపోండి

First Published | Nov 19, 2024, 5:45 PM IST

రిస్క్ తీసుకోకుండా డబ్బులు ఎక్కువ సంపాదించాలని అనుకొనే వారు ఎంచుకొనే ఇన్‌కమ్ సోర్స్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు అధిక వడ్డీని కూడా పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో 12x30x12 ఫార్ములా మీరు ఫాలో అయితే త్వరగా కోటి రూపాయలు సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం రండి. 

మ్యూచువల్ ఫండ్స్‌ పెట్టుబడి పెట్టడం ఇప్పుడు చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా SIPలు బాగా పాపులర్ అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి SIP మంచి మార్గం. నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టడం కంటే ఇందులో రిస్క్ తక్కువ. కేవలం 500 రూపాయలతో SIP మొదలుపెట్టవచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుబడి మంచి లాభాలు ఇస్తుంది. SIP ద్వారా పెద్ద పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవచ్చు. కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది. 1,000 రూపాయలతో SIP మొదలుపెట్టి కోటి రూపాయలు సంపాదించవచ్చు.

SIP (Systematic Investment Plan) అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక రెగ్యులర్ విధానంలో పెట్టుబడులు పెట్టే ప్రణాళిక. మీరు నెలవారీ లేదా మూడు నెలల ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌లో పెట్టుబడిగా పెట్టవచ్చు. SIP పద్ధతి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం బాగా ప్రాచుర్యం పొందిన విధానం. 

మీరు ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ ఎంచుకొంటే మీరు SIP చేసిన అమౌంట్ టైం ప్రకారం మీ అకౌంట్ నుంచి ఆటోమెటిక్ గా డెబిట్ అవుతుంది.  SIP ద్వారా మీరు రూ.500 లేదా రూ.1,000 వంటి చిన్న మొత్తంతో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. మార్కెట్ పెరగడం లేదా పడిపోవడం SIP పై పెద్దగా ప్రభావం చూపదు. ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నా మీ పెట్టుబడులకు రిస్క్ తక్కువ ఉంటుంది. ధర తక్కువగా ఉన్నప్పుడు మీరు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేస్తారు. ధర ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లను పొందుతారు.


12X30X12 ఫార్ములాతో SIP ద్వారా కోటీశ్వరులు కూడా కావచ్చు. ఈ ఫార్ములా ఏంటో ముందుగా బాగా అర్థం చేసుకోవాలి. ఈ SIP ఫార్ములా ప్రకారం ప్రతి సంవత్సరం పెట్టుబడిని 12% పెంచాలి. అంటే.. 1,000 రూపాయలతో SIP మొదలుపెడితే ప్రతి సంవత్సరం 12% పెంచుతూ పెట్టుబడి పెట్టాలి. ఇలా 30 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే 12% రాబడి వస్తుంది. 

ఈ ఫార్ములా ప్రకారం 1,000 రూపాయలతో మొదలుపెడితే మొదటి సంవత్సరం 1,000 రూపాయలు పెట్టాలి. రెండో సంవత్సరం 12% పెంచి 1,120 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. మూడో సంవత్సరం 12% పెంచి 1,254 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఇలా పెంచుకుంటూ పోవాలి.

ఈ విధంగా 30 ఏళ్లు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి 28,95,992 రూపాయలు అవుతుంది. 12% రాబడితో 83,45,611 రూపాయలు లాభం వస్తుంది. మొత్తంగా 1,12,41,603 రూపాయలు అవుతుంది.

క్రమబద్ధమైన SIP(Systematic Investment Plan) ద్వారా సంపదను నిర్మించడానికి 12X30X12 ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ పెట్టుబడులకు ఒక లక్ష్యం సెట్ చేయవచ్చు.

అయితే ఎక్విటీ ఫండ్స్ కొన్ని సంవత్సరాల్లో నష్టాలు చూపవచ్చు. కానీ దీర్ఘకాలంలో చరిత్రాత్మక రాబడి ఉంటుందని ఇప్పటికే నిరూపణ అయ్యింది. మీ అవసరాలకు అనుగుణంగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి.

Latest Videos

click me!