ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కేవలం ఫోటోలను షేర్ చేసుకునే వేదికగా మాత్రమే ఉండేది. ఈ ఫోటో-షేరింగ్ యాప్ ఇప్పుడు చాలా మందికి ఆదాయ వనరుగా మారింది. మీకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో 1 లక్షకు పైగా వీక్షకులు(వ్యూవర్స్) ఉంటే మీరు సుమారుగా 60 వేలకు పైగా డబ్బు సంపాదించవచ్చు. కంపెనీ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడం ద్వారా మరింత ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మీరు రీల్స్ సహాయంతో మీ సొంత వ్యాపారాన్ని, ప్రోడక్ట్ ని ప్రోత్సహించవచ్చు. లేదా ఇతరుల వ్యాపారాన్ని మీరు ప్రమోట్ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అలాగే మీరు యాడ్ లింక్‌లను అందించడం ద్వారా కూడా సంపాదించవచ్చు.
మీరు పోస్ట్ చేసే వీడియో ఆలోచనలో పాటు వీడియో డిస్క్రిప్షన్ లో కంపెనీ ప్రోడక్ట్ లింక్‌ను అందించండి. ఎవరైనా దాని ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తే మీకు కమీషన్ వస్తుంది. ఇలా మీరు మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి వీలుంటుంది.
ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్లు పలు కంపెనీల బ్రాండ్‌లతో టై అప్ అవుతారు. మీరు రీల్స్ ద్వారా బ్రాండ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
ఇవే కాకుండా మీరు Facebook ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు. ఇది రీల్స్ మధ్యలో ప్రకటనలను చేర్చే అవకాశాన్ని అందిస్తుంది. మీరు ఆ ప్రకటనల నుండి డబ్బు పొందవచ్చు. అయితే కొన్ని షరతులను తప్పక పాటించాలి. సమాజాన్ని తప్పుదారి పట్టించే వీడియోలు, నేరాల గురించి చెప్పే వీడియోలు చేసినప్పుడు రూల్స్ పాటించకపోవడం లాంటి తప్పులు చేస్తే మీ ఫేస్ బుక్ అకౌంట్ డౌన్ చేస్తారు. బ్లాక్ చేస్తారు. ఇలా జరిగితే మీకు యాడ్ రెవెన్యూ రాదు. అందువల్ల షరతులు పాటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రకాలు
20k-50k ఫాలోవర్లు - మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు
60k-160k ఫాలోవర్లు - మాక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు
300k-500k ఫాలోవర్లు - మెగా ఇన్‌ఫ్లుయెన్సర్లు
700k-1.5m ఫాలోవర్లు - సెలబ్రిటీ ఇన్‌ఫ్లుయెన్సర్లు.
ఇన్‌ఫ్లుయెన్సర్ నెలవారీ ఆదాయం
ఒక నివేదిక ప్రకారం నానో-ఇన్‌ఫ్లుయెన్సర్లు రూ.20k - రూ.30k సంపాదిస్తారు. అదేవిధంగా మైక్రో - ఇన్‌ఫ్లుయెన్సర్లు రూ. 30k - రూ. 60k, మాక్రో - ఇన్‌ఫ్లుయెన్సర్లు రూ. 60k - రూ. 68k వరకు సంపాదిస్తారు. మెగా/సెలబ్రిటీ ఇన్‌ఫ్లుయెన్సర్లు అయితే ఇంకా ఎక్కువ సంపాదిస్తారు.
అయితే ఈ ఆదాయం ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. ఈ ఆదాయం గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం మీద చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్ చేయడం ద్వారా వేల రూపాయలు సంపాదిస్తున్నారు.