భార‌త్ లో అత్యంత ఖ‌రీదైన టాప్-5 ఇళ్ళు ఎవ‌రివో తెలుసా?

First Published | Jul 20, 2024, 1:52 PM IST

Most Costliest Houses in India : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లుగా ఆసియా అప‌ర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా నంబర్ వన్ స్థానంలో ఉంది. 
 

top 5 most expensive houses in India, Costliest Houses in India,Antilia

Costliest Houses in India : భారత్ ప్రపంచంలోని అత్యంత విలాస‌వంత‌మైన‌, ఖరీదైన నివాసాలను కలిగి ఉంది. ఇది ఇక్క‌డి ఉన్నత వర్గాల సంపద, విలాస జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఎత్తైన ఆకాశహర్మ్యాల నుండి విలాసవంతమైన బంగ్లాల వరకు ప్ర‌పంచంలోని టాప్ రిచెస్ట్ గృహాలు భార‌త్ లో చాలానే ఉన్నాయి. 

2024లో భారతదేశంలో అత్యంత ఖరీదైన టాప్-5 ఇళ్లను గ‌మ‌నిస్తే.. భార‌త్ లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లుగా ఆసియా అప‌ర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా నంబర్ వన్ స్థానంలో ఉంది. యాంటిలియా, రూ.12,000 కోట్ల అంచనా ధరతో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా నిలిచింది. ఈ నివాసంలో చాలా ఖ‌రీదైన వ‌స్తువులు ఉన్నాయి. 


ముంబైలోని ప్రతిష్టాత్మకమైన ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న యాంటిలియా.. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లు . ఈ 27-అంతస్తుల ఆకాశహర్మ్యం 9 హై-స్పీడ్ ఎలివేటర్లు, 3 హెలిప్యాడ్‌లు, ఒక ఐస్ క్రీం పార్లర్, సినిమా థియేటర్, సెలూన్, జిమ్‌లను కలిగి ఉంది. ఇది భూకంపాలను 8 తీవ్రతతో తట్టుకోగలదు. 600 మంది సిబ్బంది ఇందులో ప‌నిచేస్తున్నారు. 

భారతదేశంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు జేకే హౌస్. రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియాకు చెందిన జేకే హౌస్ విలువ సుమారు ₹6000 కోట్లు. దక్షిణ ముంబైలో ఉన్న ఈ 30-అంతస్తుల నివాసం ఆధునిక డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో రెండు స్విమ్మింగ్ పూల్స్, హై-ఎండ్ కార్లను పార్కింగ్ చేయడానికి ఐదు అంతస్తులు ఉన్నాయి. 

భారతదేశపు మూడవ అత్యంత ఖరీదైన ఇల్లు అబోడ్, అనిల్ అంబానీ నివాసం.  భారతదేశంలోని మూడవ అత్యంత ఖరీదైన ఇల్లుగా, 16,000 చదరపు అడుగుల విస్తీర్ణం, హెలిప్యాడ్‌తో 70 మీటర్ల ఎత్తులో ఉంది. ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న ఈ 17-అంతస్తుల భవనం గతంలో ముఖేష్ అంబానీ, అతని కుటుంబం యాంటిలియాకు వెళ్లడానికి ముందు వారి నివాసంగా ఉండేది. గ్రాండ్ వెల్ క‌మ్ చేప్పే ప్రవేశద్వారం,  అద్భుతమైన గ్లాస్ కిటికీలను కలిగి ఉంటుంది. 

ఇక నాలుగో స్థానంలో కేఎం బిర్లాకు చెందిన జ‌తియా హౌస్ భార‌త్ లో ఖ‌రీదైన ఇళ్ల‌లో ఒక‌టిగా ఉంది. దీని అంచ‌నా విలువ దాదాపు రూ. 425 కోట్లు. ఇది 30,000 చద‌ర‌పు అడుగుల విస్తిర్ణంలో ఉంటుంది.

Shah Rukh Khan house

భార‌త్ లో అత్యంత ఖ‌రీదైన ఐద‌వ ఇల్లుగా మన్నత్, షారుక్ ఖాన్ ఇల్లు నిలిచింది. ముంబైలోని బాంద్రా వెస్ట్ లో ఉన్న ఈ ఆరు అంత‌స్తుల భ‌వ‌నం అంచ‌నా విలువ దాదాపు 200 కోట్ల రూపాయ‌ల‌కు పైనే. 27000కు పైగా చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ప్ర‌ముఖ ఆర్కిటెక్ట్ రాజీవ్ పరేఖ్ 2016లో దీనిని పునరుద్ధరించారు.  

Latest Videos

click me!