EPFO: పీఎఫ్‌ ఖాతా ఉన్న వారు ఎగిరి గంతేసే వార్త.. రూ. 5 లక్షలు పొందే అవకాశం.

కార్మిక భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ప్రతీ నెల ఉద్యోగి జీతంలో నుంచి కొంత మొత్తంలో ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగి ఈ మొత్తాన్ని ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పొందొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇందులో నుంచి కొంతమేర విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా ఈ విత్ డ్రా పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.. 

EPFO Auto Claim Settlement Limit Increased to Rupees 5 Lakh Details in telugu VNR

భవిష్య నిధి:

కార్మిక భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన వినియోగదారుల కోసం ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని రూ.  1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచనుంది. పరిపాలనా కమిటీ ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఆమోదించింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి దీనికి అనుమతి రావాల్సిందే. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

EPFO Auto Claim Settlement Limit Increased to Rupees 5 Lakh Details in telugu VNR

అడ్వాన్స్ క్లెయిమ్ పరిమితి:

గత మే 2024లో, ముందుగా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి అడ్వాన్స్ క్లెయిమ్ ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని రూ. 50,000 నుంచి రూ.  1 లక్షకు  పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వైద్యం, విద్య, వివాహంతో పాటు ఇల్లు కొనడం/నిర్మించడం వంటి నాలుగు ప్రత్యేక పరిస్థితులలో కార్మిక భవిష్య నిధి నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఆటో సెటిల్‌మెంట్‌కు అనుమతి ఉంటుంది. 


సులభ ప్రక్రియ:

కార్మిక భవిష్య నిధి సంస్థ ఇటీవల ఆటో సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేసింది. దీని ఫలితంగా చాలా క్లెయిమ్‌లు మూడు రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయి. గతంలో దీనికి కొన్ని వారాలు పట్టేది. కానీ ఎప్పుడు దరఖాస్తు చేసుకున్న కేవలం 3 రోజుల్లోనే డబ్బులు ఖాతాల్లోకి వచ్చేస్తున్నాయి. 

ఆటో సెటిల్‌మెంట్ పరిమితి:

ప్రస్తుతం, ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని పెంచడం వల్ల, క్లెయిమ్ పరిష్కారాల సంఖ్య మొదటిసారి  6 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. ఆటో సెటిల్‌మెంట్ సభ్యుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో  90 లక్షల కంటే తక్కువగా ఉంది. ఈ సంవత్సరం దాదాపు 2 కోట్లకు పెరిగింది. అంటే రెండింతల కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. 

పీఎఫ్ క్లెయిమ్‌ల సంఖ్య:

ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్‌లలో కేవలం 8% మంది సభ్యులు  పనిచేస్తున్న సంస్థల నుంచి వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అవసరమవుతున్నాయి. దాదాపు 48% క్లెయిమ్‌లు నేరుగా సభ్యులే సబ్మిట్ చేస్తున్నారు. 44% ఆటోమేటిక్ గా ప్రాసెస్ అవుతున్నాయి. ఈపీఎఫ్ఓ ఇప్పటికే ప్రక్రియల సంఖ్యను 27 నుంచి 18కి తగ్గించింది. దీనిని 6కి తగ్గించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దేశంలో పీఎఫ్ ఖాతాలు ఉన్న కోట్లాది మందికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Latest Videos

vuukle one pixel image
click me!