Maruti Alto K10: కేవలం రూ.6,000 ఈఎంఐతో ఈ కారు సొంతం చేసుకోండి

Naga Surya Phani Kumar | Published : May 11, 2025 7:45 PM
Google News Follow Us

Maruti Alto K10: తక్కువ ధరకే కారు కొనాలనుకుంటున్నారా? అయితే మారుతి ఆల్టో K10 మీకు పర్ఫెక్ట్ కారు. ఇప్పటికిప్పుడు ఈ కారును మీరు సొంతం చేసుకోవాలంటే నెలకు రూ.6,000 EMI కడితే చాలు. ఈ కారు ధర, ఫీచర్స్ గురించి పూర్తి వివరాలు ఇవిగో. 

15
Maruti Alto K10: కేవలం రూ.6,000 ఈఎంఐతో ఈ కారు సొంతం చేసుకోండి

ఈ కాలంలో ప్రతి ఫ్యామిలీ మెన్ కారు ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. టూర్లు, ఫంక్షన్స్, వెకేషన్ కి వెళ్లడానికి ఇలా ఏదో ఒక సందర్భంలో కారు అవసరం ఏర్పడుతోంది. అయితే కొంతమంది అప్పటికప్పుడు కారు రెంట్ కి తీసుకొని అవసరం తీర్చుకుంటారు.

దీనికంటే సొంతంగా కారు కొనడం బెస్ట్ అని మీరు డిసైడ్ అయితే తక్కువ ధరలో లభించే ఆల్టో కే 10 మీకు ఫర్ఫక్ట్ ఎంపిక. 

25

రూ.4 లక్షలకే ఆల్టో K10 

ఆల్టో K10 ధర కేవలం రూ.4 లక్షలు మాత్రమే. ఈ కారుని రూ.6,000 EMI తో మీరు సొంతం చేసుకోవచ్చు.

ఈ కారు ఇంజిన్ విషయానికొస్తే 998 cc కెపాసిటీని కలిగి ఉంది. అంతేకాకుండా 3 సిలిండర్ K10C పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.

ఇది 66 bhp వద్ద 6,000 rpm శక్తిని పొందుతుంది. 89 Nm, 3,500 rpm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

35

ఆల్టో కే 10 కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 24.39 kmpl మైలేజ్ ఇస్తుంది. అదే CNG వేరియంట్ అయితే 33.85 km/kg మైలేజ్ ఇస్తుంది.

6 ఎయిర్‌బ్యాగ్‌లతో రక్షణ

డ్రైవర్, ప్రయాణీకులకు కూడా ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కొన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 7 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లలో పవర్ స్టీరింగ్, AC ఉన్నాయి.

45

ఆల్టో K10 ధర వివరాలు

ఈ కారు వివిధ రంగుల్లో లభిస్తుంది. ఆల్టో K10 Std వేరియంట్ ధర రూ.4 లక్షలుగా ఉంది. అదే LXi వేరియంట్ అయితే రూ.4.80 లక్షలు, VXi వేరియంట్ అయితే రూ.5.10 లక్షలకి మీరు కొనుగోలు చేయొచ్చు. మరికొన్ని ఫీచర్లు ఉన్న VXi (O) వేరియంట్ అయితే రూ.5.50 లక్షలు, VXi+ వేరియంట్ అయితే రూ.5.80 లక్షలకు లభిస్తుంది. 

55

ఆల్టో K10 కారు EMI ఎంతంటే..

ఆల్టో K10 కారు మీకు కొనుగోలు చేయాలంటే ముందుగా రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌ కట్టాలి. మిగతా డబ్బుకు 9% వడ్డీతో లోన్ పొందవచ్చు. 7 సంవత్సరాల పాటు మీరు EMI పెట్టుకుంటే నెలకు సుమారుగా రూ.6,000 కట్టాల్సి ఉంటుంది. 

Read more Photos on
Recommended Photos