అక్కడ రూ.2 కన్నా తక్కువకే లీటరు పెట్రోల్.. కానీ ఇండియాలో అత్యధిక ధర ఎందుకొ తెలుసుకోండి..?

First Published Feb 24, 2021, 1:48 PM IST

భారతదేశంలో  వరుసగా పెరుగుతున్న  పెట్రోల్, డీజిల్ ధరలపై  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా వరుసగా  పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఢీల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.90  చేరుకుంది.  రోజువారీగా పెరుగుతున్న చమురు ధరలు కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి.  భారతదేశంలోని వినియోగదారులు పెట్రోల్, డీజిల్ పై మూల ధర కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా చెల్లిస్తున్నారు.

భారతదేశంలో పెట్రోల్ ధర ఢీల్లీలో 90.93 రూపాయలకు, ముంబైలో లీటరుకు 97.34 రూపాయలకు చేరుకుంది. కోల్‌కతాలో రూ.91.12, చెన్నైలో ఒక లీటర్ పెట్రోల్ రూ.92.90 వద్ద విక్రయిస్తున్నారు.ప్రపంచంలో చౌకైగా పెట్రోల్ అందుబాటులో ఉన్న దేశాల గురించి ఏవో తెలుసా..
undefined
దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న దేశం వెనిజులా, దీని రాజధాని కారకాస్. ప్రపంచంలో చౌకైన పెట్రోల్ వెనిజులాలో లభిస్తుంది. వెనిజులాలో ఒక లీటరు పెట్రోల్ ధర 1.50 రూపాయలు మాత్రమే. అవును నిజమే వెనిజులాలో రెండు రూపాయల కన్నా తక్కువ ధరకే పెట్రోల్ లభిస్తుంది.
undefined
ఇరాన్‌లో ఒక లీటరు పెట్రోల్ 5 రూపాయల కన్నా తక్కువకు లభిస్తుంది. ఇరాన్ ఆసియా నైరుతి విభాగంలో ఉన్న దేశం. ఇరాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ .4.50. ముడి చమురు కూడా ఇరాన్‌లోనే ఉత్పత్తి అవుతుంది. భారత్‌తో సహా పలు దేశాలకు ముడి చమురును కూడా ఇరాన్ ఎగుమతి చేస్తుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్.
undefined
నాల్గవ స్థానంలో అల్జీరియా గాసోలిన్ పరంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న అల్జీరియాలో అత్యంత చౌకగా పెట్రోల్ లభిస్తుంది. ఆఫ్రికన్ దేశం అయిన అల్జీరియా యూరోపియన్ దేశాల సరిహద్దులో ఉంది. అల్జీరియాలోని పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు రూ .25.15.
undefined
అంగోలాలో వాటర్ బాటిల్ కంటే చౌకగా పెట్రోల్మీరు ఇక్కడ లీటర్ వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే పెట్రోల్ లభిస్తుంది. అంగోలా నైరుతి ఆఫ్రికాలోని ఒక దేశం. అంగోలాలో పెట్రోలియం ఆయిల్, బంగారం వంటి ఖనిజాల నిల్వ ఉంది, కాబట్టి ఇక్కడ చమురు ధర చాలా చౌకగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు లీటరు పెట్రోల్‌కు 17.82 రూపాయలు చెల్లిస్తారు.
undefined
కువైట్‌లో ఒక లీటర్ పెట్రోల్ ధర వెనిజులా, ఇరాన్, అంగోలా, అల్జీరియా తరువాత కువైట్‌లో ప్రపంచంలోనే చౌకైన పెట్రోల్ లభించే దేశం. కువైట్‌లో ఒక లీటరు పెట్రోల్ ధర 25.25 రూపాయలు. ఇరాన్ లాగానే కువైట్‌లో కూడా ముడి చమురు ఉత్పత్తి అవుతుంది. అందువల్ల చాలా దేశాలు ముడి చమురును కువైట్ నుండి కొనుగోలు చేస్తాయి.ఈ సమాచారం కొన్ని నివేదికలు, globalpetrolprices.com నుండి సేకరించబడింది.గమనిక : ఈ ధరలు 15 ఫిబ్రవరి 2021 నాటివి
undefined
పెట్రోల్, డీజిల్ ధరల వరుస పెంపుకు నేడు బ్రేక్ పడింది. ఈ రోజు ఇంధన ధరలను రాష్ట్ర చమురు కంపెనీలు యధాతధంగా కొనసాగించాయి. దీంతో డీజిల్, పెట్రోల్ ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం డీజిల్ ధర 35 నుంచి 38 పైసలకు పెరిగిగా, పెట్రోల్ ధరను 34 నుంచి 35 పైసలకు పెంచారు.నగరం డీజిల్ పెట్రోల్ఢీల్లీ 81.32 90.93కోల్‌కతా 84.20 91.12ముంబై 88.44 97.34చెన్నై 86.31 92.90హైదరాబాద్‌ 88.69 94.54
undefined
వినియోగదారులను బెంబేలెత్తిస్తున్న పెట్రో ధరలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలకు కూడా దిగాయి. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడికి లేఖ కూడా రాశారు. శివసేన పార్టీ కూడా పెరుగుతున్న పెట్రో ధరలపై కేంద్రంపై విమర‍్శలు గుప్పించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌, అసోం, రాజస్థాన్, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలపై పన్ను తగ్గింపును ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఈ నెలలో ఇప్పటివరకు పెట్రోల్‌ ధరలు 15 సార్లు పెరిగి రికార్డు నెలకొల్పింది.
undefined
undefined
click me!