Summer: ఎండ తీవ్రత పెరుగుతోంది. ఎండలు మరింత పెరగనున్నాయని వాతావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా మంది కూల్ గ్యాడ్జెట్లను ఉపయోగిస్తున్నారు. అయితే మార్కెట్లో ఎయిర్ కండిషన్ డ్రెస్‌లు కూడా ఉన్నాయని తెలుసా.?
ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో చల్లదనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులే ఎయిర్-కండిషన్ జాకెట్. ఇది వ్యక్తిగతంగా ధరించే చిన్న ఎయిర్ కూలింగ్ వ్యవస్థలా పనిచేస్తుంది. జాకెట్‌లో అమర్చిన చిన్న ఫ్యాన్‌లు గాలి ప్రసరణను పెంచి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఇంట్లోనూ, బయట పనిచేసే వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదో స్మార్ట్ జాకెట్.
25
తేలికైన, బలమైన మెటీరియల్
ఈ జాకెట్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేస్తారు. ఇది చాలా తేలికగా ఉండటంతో ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఫ్యాబ్రిక్ అబ్రేషన్, నీటికి నిరోధకత కలిగి ఉంటుంది. అంటే సాధారణ వాడకంలో సులభంగా దెబ్బతినదు. మెషిన్ వాష్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ధర విషయానికొస్తే ఈ ఎయిర్ కండిషనర్ జాకెట్ అమెజాన్‌లో అసలు ధర రూ. 3999కాగా 31 శాతం డిస్కౌంట్‌తో రూ. 2754కి లభిస్తోంది.
35
ఐస్ కాలర్ ప్రత్యేకత
ఈ జాకెట్‌లో ఉన్న ఐస్ కాలర్ ప్రత్యేక ఫీచర్. దీన్ని తడిపితే శరీర ఉష్ణోగ్రత కంటే సుమారు 15 డిగ్రీల వరకు తక్కువగా చల్లదనం అందిస్తుంది. దీంతో వేసవిలో బయట పని చేసే సమయంలో కూడా శరీరం త్వరగా వేడెక్కకుండా ఉంటుంది.
జాకెట్‌లో ఉన్న ఫ్యాన్‌లు 10000 mAh పవర్‌బ్యాంక్‌తో పనిచేస్తాయి. ఈ పవర్‌బ్యాంక్‌ను జాకెట్ ఫ్యాన్‌లకు మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు చార్జ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. పూర్తి చార్జ్‌లో మధ్యస్థ మోడ్‌లో ఫ్యాన్‌లు సుమారు 5.5 నుంచి 6 గంటలు పనిచేస్తాయి.
55
అన్ని కాలాల్లో ఉపయోగించుకునే జాకెట్
ఈ జాకెట్‌లో ఉన్న ఫ్యాన్‌లను తీయగలిగే విధంగా రూపొందించారు. ఫ్యాన్‌లను తీసేస్తే ఇది సాధారణ స్టైలిష్ విండ్ప్రూఫ్ జాకెట్‌లా ఉపయోగించవచ్చు. అందువల్ల ఇది అన్ని కాలాల్లో ధరించడానికి అనుకూలంగా ఉంటుంది. తేలికగా ఉండటం వల్ల ప్రయాణాలు, అవుట్‌డోర్ పనులు, ఫీల్డ్ జాబ్స్ వంటి సందర్భాల్లో మంచి ఉపయోగం ఉంటుంది.