Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ పసిడి రేట్లు పడిపోవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
పసిడి ప్రియులకు ప్రస్తుతం అనుకూలమైన సమయం. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో సెషన్‌లో తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. గత రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ.1000కుపైగా పడిపోయింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా గత సెషన్‌లో భారీగా తగ్గి, ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి.
24
రూ.1,54,750కు చేరిన మేలిమి బంగారం
ఇప్పుడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ విషయానికి వస్తే, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఈరోజు మరో రూ.540 తగ్గి రూ.1,54,750 వద్దకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.1,41,850 వద్ద కొనసాగుతోంది. వరుసగా రెండు రోజులు ధరలు తగ్గడం వల్ల బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు.
34
స్థిరంగా కొనసాగుతున్న వెండి
వెండి ధరల విషయానికి వస్తే, గత సెషన్‌లో కిలోకు రూ.5వేలు వరకు తగ్గిన ధర ఈరోజు అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,75,000 వద్ద ఉంది. భారీ తగ్గుదల తర్వాత స్థిరత్వం కనిపిస్తోంది.
దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధోరణి కారణంగా రాబోయే రోజుల్లో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల పెట్టుబడి లేదా కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనించడం అవసరం.