Business Idea: తాగిపడేసిన బొండాలతో నెలకు రూ. 2 లక్షలు.. వేసవిలో ఎవర్‌గ్రీన్ బిజినెస్ ఇది.!

Published : Apr 22, 2026, 07:00 AM IST

Business Idea: పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడం ద్వారా నాగరాజ్ సింగ్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి.. 

PREV
15
వ్యర్థాలతో వ్యాపారం..

సాధారణంగా కొబ్బరి బొండాల నీళ్లు తాగిన తర్వాత వాటిని వ్యర్థాలుగా పారేస్తాం. కానీ, ఆ వ్యర్థాలనే పెట్టుబడిగా మార్చుకొని నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు హైదరాబాద్‌లోని కుంట్లూర్ ప్రాంతానికి చెందిన నాగరాజ్ సింగ్. కొబ్బరి పీచు, కోకో పీట్ తయారీ ద్వారా ఆయన ఈ వినూత్న వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

25
వ్యాపార ఆలోచన, ప్రారంభం

నాగరాజ్ సింగ్ తండ్రి 1990ల నుంచే ఈ రంగంలో ఉన్నారు. గతంలో ఆలయాల నుంచి సేకరించిన ఎండు కొబ్బరి పీచుతో వ్యాపారం చేసేవారు. అయితే, ముడి సరుకు కొరత ఏర్పడటంతో, నాగరాజ్ సింగ్ పచ్చి కొబ్బరి బొండాల నుంచి పీచు తీసే సరికొత్త మిషనరీని స్వయంగా డిజైన్ చేసి ఈ వ్యాపారాన్ని విస్తరించారు.

35
తయారీ విధానం, ఉత్పత్తులు

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉచితంగా లేదా తక్కువ ధరకు కొబ్బరి బొండాల వ్యర్థాలను సేకరిస్తారు. వీటిని మెషిన్‌లో ప్రాసెస్ చేయడం ద్వారా రెండు ప్రధాన ఉత్పత్తులు లభిస్తాయి.

కొబ్బరి పీచు(Coir): దీనిని సోఫా సెట్లు, ఫాల్ సీలింగ్ పనులు, తాళ్లు, మ్యాట్లు, సినిమా షూటింగులలో సెట్స్ తయారీకి ఉపయోగిస్తారు.

కోకో పీట్(Coco Peat): ఇది గార్డెనింగ్, నర్సరీలు, టెర్రస్ గార్డెన్లకు అద్భుతమైన ఎరువుగా ఉపయోగపడుతుంది.

45
పెట్టుబడి, లాభాలు

ఈ యూనిట్ స్థాపించడానికి సుమారు రూ. 25 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో 49 హెచ్‌పి సామర్థ్యం గల మిషనరీ, ఇతర మౌలిక సదుపాయాలు ఉంటాయి. సరైన నిర్వహణ, మార్కెటింగ్ ఉంటే, అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు నికర లాభం పొందవచ్చని ఆయన తెలిపారు.

55
ఎంతో మందికి ఉపాధి

పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడం ద్వారా నాగరాజ్ సింగ్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి తన వంతు సహకారం, శిక్షణ అందిస్తానని ఆయన పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories