Today Gold Rate: భారీగా పతనమైన వెండి..స్థిరంగా కొనసాగుతున్న పసిడి

Published : Apr 21, 2026, 11:17 AM IST

Today Gold Rate: పసిడి ప్రియులకు ఇవాళ కాస్త ఊరట దొరికింది. చాలా రోజుల తర్వాత బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కానీ వెండి మాత్రం క్షీణించింది. కొద్ది రోజుల క్రితం కిలో వెండి రూ.2లక్షల 30 వేలు ఉండగా ఇప్పుడు ఎంతుందో తెలుసా ?

PREV
14
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి

భారతదేశంలో ఇవాళ బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు కీలక సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవల గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో మారుతూ వచ్చిన ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గిన దిశగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు మాత్రం గణనీయంగా పడిపోయాయి. 

24
స్థిరంగా కొనసాగుతున్న బంగారం

మొదటగా బంగారం ధరలను చూస్తే, 24 క్యారెట్ పసిడి ధర గ్రాముకు సుమారు రూ.15,529 వరకు ఉంది. అదే 22 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.14,235 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.1.53 లక్షల పరిధిలో కొనసాగుతోంది. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు నమోదవుతున్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే బంగారం ధరలో పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. 

34
భారీగా కుప్పకూలిన వెండి

ఇక వెండి విషయానికి వస్తే పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. వెండి ధరలు ఈరోజు గణనీయంగా పడిపోయాయి. వెండిపై రూ. 5వేలు తగ్గింది. ప్రస్తుతం వెండి రూ.2,74,900 వద్ద నమోదవుతోంది.

ఈ ధరల మార్పులకు ప్రధాన కారణాలు అంతర్జాతీయ పరిణామాలే. అమెరికా డాలర్ బలపడటం, గ్లోబల్ జియోపాలిటికల్ టెన్షన్స్, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉన్న అనిశ్చితి పరిస్థితులు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అలాగే పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ చేయడం కూడా ధరలు తగ్గడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. 

44
అస్థిరంగానే మార్కెట్

మొత్తంగా చూస్తే, బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ స్వల్పంగా తగ్గాయి. వెండి మాత్రం భారీగా కుప్పకూలింది. ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేయాలా, లేక వేచి చూడాలా అన్నది పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయించుకోవాల్సిన సమయం. మార్కెట్ ఇంకా అస్థిరంగా ఉండటంతో వచ్చే రోజుల్లో ధరల్లో మార్పులు కొనసాగవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories