ఎలక్ట్రిక్ కార్లు, బైకులు వాడుతున్న వారికి షాకింగ్ న్యూస్.. వాటిని రీసేల్ చేయడం చాలా కష్టమట, ఎందుకంటే

Published : Oct 28, 2025, 01:11 PM IST

Electric cars: ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తక్కువగానే ఉన్నాయి, జీఎస్టీ 2.0 తర్వాత వాటి ధరలు ఇంకా పడిపోయాయి. ఎక్కువ మంది ఈవీలను కొంటున్నారు. కానీ వాటిని రీసేల్ చేయడం కష్టం అనే వాదన వినిపిస్తోంది. ఎందుకో తెలుసా? 

PREV
15
కొనడం సులువే... అమ్మడమే కష్టం

పెట్రోలు డీజిల్ తో పనిలేకుండా విద్యుత్ తో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు కొత్తగా ఎక్కువ మంది మనసును దోచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటిని వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ సంఖ్య అధికంగానే ఉంది. అయితే ఈవీలను కొన్నా కూడా వాటిని రీసేల్ చేయడం కష్టమనే వాదన వినిపిస్తోంది. దీనికి బ్లూస్మార్ట్ అనే భారతీయ ఎలక్ట్రిక్ క్యాబ్ సంస్థని ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఈ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల బారిన పడి తమ వాహనాలను వెంటనే అమ్మకానికి పెట్టింది. ఆ కార్లన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అయినా కూడా ఆ కారు ధరలో కేవలం నాలుగో వంతు ధరకే అవి అమ్ముడయ్యాయి. దీంతో ఈ కార్లను కొన్నా కూడా వాటిని రీసేల్ చేయడం కష్టమని అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది.

25
బ్యాటరీ ఖర్చు ఎక్కువే

ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుదలకు ముఖ్య కారణం అందులో వాడే బ్యాటరీ. ఎలక్ట్రిక్ కారు ధరలో 30 నుంచి 40 శాతం ఖర్చు బ్యాటరీ కోసమే చేస్తారు. ఎప్పుడైతే కారు పాత పడుతుందో బ్యాటరీ సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. దాన్ని తరచుగా ఛార్జింగ్ చేయాల్సి రావచ్చు. లేదా తరచూ అది వేడెక్కిపోవచ్చు. వాహనం కూడా ఆ బ్యాటరీ పనితీరు వల్ల సరిగ్గా నడపలేకపోవచ్చు. పోనీ బ్యాటరీని మారుద్దామా అంటే అది చాలా ఖర్చుతో కూడిన విషయం. అందుకే ఆ బ్యాటరీల కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతున్నట్టు తెలుస్తోంది.

35
రేటు అంచనా వేయలేరు

సాధారణ కార్లను మెకానిక్ దగ్గర తీసుకెళ్లి సెకండ్ హ్యాండ్ కి ఎంత ధరకు కొనవచ్చో చెప్పమంటే అతడు ఇంజిన్ సామర్ధ్యాన్ని చూసి చెప్పేస్తాడు. కానీ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ స్థితిని అంచనా వేయడం కష్టం. బ్యాటరీ డేటా అనేది ఆటోమేకర్ సాఫ్ట్ వేర్ లో లాక్ అయ్యి ఉంటుంది. దాన్ని వేరే వాళ్ళు చూడలేరు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల విలువను అంచనా వేయడం కూడా కష్టంగా మారి... చాలామంది అవి వాటిని సెకండ్ హ్యాండ్ కొనేందుకు ఇష్టపడడం లేదు.

45
మరి ఎందుకు కొంటున్నారు?

ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ మాత్రం వేగంగానే అభివృద్ధి చెందుతోంది. ఛార్జింగ్ వేగంగా కావడం, తక్కువ ఖర్చు, కొత్త మోడల్స్, కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్లు.. వీటి వల్ల అది ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఒకసారి ఛార్జి చేస్తే చాలు 200 నుంచి 300 కిలోమీటర్లకు పైగానే కార్లు పరుగులు తీస్తున్నాయి. అదే పెట్రోల్ కార్లు అయితే వాటికి ఎక్కువ ఇంధనం అవసరం పడుతుంది. అదే ఎలక్ట్రిక్ వాహనాలు అయితే తక్కువ విద్యుత్ తోనే నడుస్తాయని అభిప్రాయంతో ఎంతో మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

55
ఏం చేయాలి?

ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం వల్ల పర్యావరణానికి కూడా మేలే జరుగుతుంది. ఎలాంటి కాలుష్యం విడుదలవ్వదు. అందుకే ప్రభుత్వం కూడా సబ్సిడీలు అందిస్తోంది. కేవలం మన దేశంలోనే కాదు చైనాలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీలు వస్తున్నాయి. చైనా నుంచి భారీగానే ఇతర దేశాలకు ఈవీలు ఎగుమతి అవుతుండడంతో వాటి ధరలు కూడా తగ్గిపోతున్నాయి. అయితే వాటిని తిరిగి రీసేల్ చేయడంలో మాత్రం ఎంతోమంది విఫలమవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories