Baba Vanga: బాబా వంగా జోస్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆమె బంగారం గురించి ముందే ఊహించి చెప్పింది. 2026లో ప్రపంచ మార్కెట్ అంతా బంగారంపైనే ఆధారపడి ఉంటుందని, బంగారం ఉన్నావారు కోటీశ్వరులేనని వివరించింది.
కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోతోంది. దీపావళి తర్వాత మన దేశీయ మార్కెట్లో కొద్దిగా ధర తగ్గినా కూడా మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి పెరుగుతున్న ధరలతో పోలిస్తే తగ్గిన ధర చాలా తక్కువే. 2025 మరో రెండు నెలల్లో ముగిసిపోతుంది. 2026లో బంగారం ధరపై ఇప్పటి నుంచే చర్చలు మొదలైపోయాయి. ముఖ్యంగా బాబా వంగా చెప్పిన జోస్యం వైరల్ అవుతోంది.
25
బాబా వంగా జోస్యం
2026లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని బల్గేరియాకు చెందిన బాబా వంగా ముందే జోస్యం చెప్పారు. ఆమె చెబుతున్న ప్రకారం ప్రపంచ మార్కెట్లలో అస్థిరత వల్ల అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు. బాబా వంగా జోస్యం నిజమైతే బంగారం ఇంట్లో ముందుగానే కొని పెట్టుకున్నవారు కోటీశ్వరులతో సమానం.
35
2026 లో బంగారం విలువ
ప్రపంచంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడితే బంగారం ధరలు 25 నుంచి 40 శాతం పెరగొచ్చని మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. వచ్చే దీపావళి నాటికి బంగారం ధరలు మరింతగా పెరిగిపోతుంది. పదిగ్రాముల బంగారం ధర రూ.1,62,500 నుంచి రూ.1,82,000 మధ్య ఉండొచ్చని అంచనా. ఇది బంగారం ధరల్లో కొత్త రికార్డు అనే చెప్పుకోవాలి.
అక్టోబర్ 27, సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇలా ఉంది.
చెన్నై: రూ.1,14,500
ముంబై: రూ.1,14,100
ఢిల్లీ: రూ.1,14,250
కోల్‌కతా: రూ.1,14,100
బెంగళూరు: రూ.1,14,100
హైదరాబాద్: రూ.1,14,100
55
బంగారు మార్కెట్ లో ఉత్సాహం
2026 బంగారం ధరలపై బాబా వంగా జోస్యం ప్రపంచ మార్కెట్లో ఉత్సాహం నింపుతుంది. బంగారంపై పెట్టుబడి పెట్టేవారు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ దగ్గర ఉన్న బంగారం జాగ్రత్తగా దాచుకుంటే చాలు మీరు లక్షాధికారులు, కోటీశ్వరులు కావడం ఖాయం.