జాబ్ మానేసి బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఇలా చేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు

Published : Jan 25, 2025, 10:53 AM ISTUpdated : Jan 25, 2025, 10:54 AM IST

ఈ రోజుల్లో చాలా మంది జాబ్స్ చేయలేక పోతున్నారు. కారణం ఇచ్చే శాలరీకి, చేయించే పనికి ఎక్కడా పొంతన ఉండదు. ఆదాయం సరిపోక, కుటుంబ అవసరాలు తీర్చలేక చాలా మంది జాబ్ మానేసి బిజినెస్ చేయాలని ఆలోచనలు చేస్తుంటారు. మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. జాబ్ మానేసే ముందు ఇలా చేస్తే మీరు, మీ కుటుంబం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడకుండా ఉంటుంది. బిజినెస్ కూడా కచ్చితంగా డవలప్ అవుతుంది. అదెలాగో చూద్దాం రండి.   

PREV
15
జాబ్ మానేసి బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఇలా చేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు

ఈ రోజుల్లో జాబ్ చేయడం ఎంత ఒత్తిడిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. వర్క్ ప్రెషర్ పెంచేస్తుండటం వల్ల 8 గంటల వర్కింగ్ టైమ్ కాస్తా 12 గంటలకు పైగా పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ బాధ్యతలు, ఉద్యోగ విధులు రెండూ నిర్వహించలేక జాబ్ మానేసి చిన్న బిజినెస్ చేసుకుంటే చాలు అని  చాలా మంది అనుకుంటారు. మీరు కూడా అలానే అనుకుంటున్నారా? 
 

25

వర్క్ ప్రెషర్ తట్టుకోలేక వెంటనే జాబ్ మానేస్తే మీ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడిపోతుంది. ఫైనాన్షియల్ గా అవసరాలు తీర్చలేక మీరు అప్పులు చేయాల్సి వస్తుంది. అవి సకాలంలో తీర్చలేకపోతే మరిన్ని ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముడతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇక్కడ చెప్పిన విధంగా ట్రై చేయండి. 

మీకు జాబ్ మానేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే ఈ విషయాలు ఒకసారి చెక్ చేసుకోండి.
మీకు జాబ్ కాకుండా ఇతర ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రతి నెల రెంట్స్ ఆదాయం, పొలాలు ఉంటే వాటిపై ఆదాయం, ఫ్యామిలీ బిజినెస్ ఉంటే అందులో మీకు వాటాగా ఏమైనా ఆదాయం వస్తుందా? ఇలాంటి ఆదాయ మార్గాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. 

35

ఒకవేళ ఉంటే ప్రస్తుతం మీకు ఉన్న లోన్స్, EMIలు, ఇతర అప్పులను దృష్టిలో ఉంచుకొని మీకు వచ్చే ఆదాయాలు, తీర్చాల్సిన అప్పులు సరిపోతున్నాయో లేదో ఆలోచించండి. అలా రెగ్యులర్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఉండేలా ఉంటే మీరు హాయిగా జాబ్ మానేసి బిజినెస్ ప్లాన్ చేసుకోండి.

అలా కాకుండా ఎటువంటి ఇతర ఆదాయ మార్గాలు లేకుండానే మీరు జాబ్ మానేయాలని అనుకుంటే వెంటనే ఆ పని చేయొద్దు. దీని కోసం మీరేం చేయాలంటే.. ముందుగా మీరు పెట్టాలనుకున్న బిజినెస్ గురించి పూర్తిగా విశ్లేషించండి. లోటుపాట్లు, కష్టనష్టాలు, లాభాలు, ఒత్తిడులు ఇలా అన్ని విషయాలపై ఒక అవగాహన తెచ్చుకోండి. 

45

జాబ్ చేస్తూనే మీరు పెట్టాలనుకున్న బిజినెస్ ను చిన్నగా స్టార్ట్ చేయండి. ఉదాహరణకు మీరు హోటల్ పెట్టాలనుకుంటున్నారు అనుకుందాం. ఇది ఉదయం, సాయంత్రం చేసే పని. అందువల్ల మీరు జాబ్ చేస్తూనే ట్రక్ వెహికల్ లో హోటల్ స్టార్ట్ చేయండి. మీరు చేయగలిగితే పర్లేదు. లేకపోతే వర్కర్స్ పెట్టి మీరు సూపర్ వైజింగ్ చేయండి. రెండు, మూడు నెలలు దానిపై లాభాలు ఆశించకుండా కష్టపడండి. దీంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది. 
 

55

ఈ బిజినెస్ ను మరింత పెంచితే కచ్చితంగా లాభాలు వస్తాయని మీకు నమ్మకం కలిగితే అప్పుడు జాబ్ మానేసి, మీ పూర్తి టైమ్ బిజినెస్ పైనే పెట్టండి. సొంతంగా పెట్టుకున్న వ్యాపారం కోసం 24 గంటలు కష్టపడినా ఎలాంటి కష్టం అనిపించదు. మీ హోటల్ కి ఒక బ్రాండ్ వచ్చేంత వరకు కష్టపడండి. ఫుడ్ ఆ హోటల్ లో చాలా బాగుంటుంది అనే పేరు మీకు వచ్చిందంటే మీరు సక్సెస్ అయినట్టే. అప్పుడు ట్రక్ వెహికల్ పై హోటల్ ని మరో చోట కూడా స్టార్ట్ చేయండి. లేదా మంచి సెంటర్ చూసుకొని బిల్డింగ్ రెంట్ కి తీసుకొని పెద్దగా హోటల్ స్టార్ట్ చేయండి. ఆటోమెటిక్ గా మీ ఆదాయం పదింతలు అవుతుంది. 

ఆ ఐడియా కేవలం హోటల్ కే కాదు. టీ దుకాణం, బట్టల షాపు, వ్యవసాయం, ఫ్యాన్సీ స్టోర్, సూపర్ మార్కెట్ ఇలా ఏ బిజినెస్ అయినా ఇలాగే ప్లానింగ్ ప్రకారం కష్టపడితే కచ్చితంగా సక్సెస్ అవుతుంది. 
 

click me!

Recommended Stories