రెనాల్ట్ డస్టర్ మళ్లీ మార్కెట్ లోకి వస్తోందా? హ్యుందయ్, కియా, మారుతీ కంపెనీలకు చెక్ పడినట్లే

Published : Jan 24, 2025, 07:54 PM IST

రెనాల్ట్ కంపెనీకి చెందిన డస్టర్ కారుకు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 2012లో విడుదలైన ఈ కారును ఇప్పటికీ సెకండ్స్ లో కొనేందుకు చాలా మంది ఇష్టపడతారు. మరి అలాంటి ఈ కారు మళ్లీ మార్కెట్ లోకి విడుదల కానుందా? టెక్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి. 

PREV
14
రెనాల్ట్ డస్టర్ మళ్లీ మార్కెట్ లోకి వస్తోందా?  హ్యుందయ్, కియా, మారుతీ కంపెనీలకు చెక్ పడినట్లే

ఫ్రాన్స్ దేశానికి చెందిన రెనాల్ట్ కంపెనీ ఇండియాలో 2008 సంవత్సరంలో అడుగు పెట్టింది. తమిళనాడులోని చెన్నై సమీపంలో ప్లాంట్ ప్రారంభించింది. 2012లో మొట్టమొదటి సారిగా డస్టర్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త రకమైన మోడల్ కి భారతీయులు ఫిదా అయిపోయారు. 2022లో ఈ కారు తయారీని నిలిపివేశారు.

రెనాల్ట్ డస్టర్ 2012 - 2015 మధ్య భారతదేశంలోని ఇతర కార్ బ్రాండ్‌ల కంటే ఎక్కువ అవార్డులను అందుకుంది. రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో 29 అవార్డులను అందుకుంది. రెనాల్ట్ కంపెనీ 34 అవార్డులను అందుకుంది. దీన్ని బట్టి డస్టర్ కారును ఇష్టపడే వారు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. 

24

ప్రముఖ SUV రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో తిరిగి వస్తుందన్న సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే 2024 చివర్లో కొత్తగా మార్కెట్ లోకి విడుదల చేసే కార్లను అన్ని రకాలుగా పరీక్షలు చేస్తారు. ఆ సమయంలో డస్టర్ కారు కూడా కనిపించిందని టెక్ నిపుణనులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన కొన్ని నివేదికల ప్రకారం కొత్త డస్టర్ మోడల్ 2026 ప్రారంభంలో మార్కెట్ లోకి వస్తుందని తెలుస్తోంది. 

 

34

కొత్త డస్టర్ ఫీచర్లు

కొత్త డస్టర్ ఫీచర్లపై టెక్ నిపుణులు కొన్ని సూచనలు చేశారు. వాటి ప్రకారం CMF-B ప్లాట్‌ఫారమ్‌పై కొత్త డస్టర్ తయారవుతుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి SUVలతో పోటీ పడుతుంది.

కొత్త డస్టర్‌లో టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, అధునాతన భద్రతా ఫీచర్లు ఉంటాయి. ప్రస్తుతానికి ఇవే వివరాలు ఉన్నాయి. మరి నిజంగా డస్టర్ మోడల్ వస్తే కారు ప్రియులకు పండగనే చెప్పొచ్చు.

44

ఈ ఏడాదిలోనే కొత్త ట్రైబర్, కిగర్..

రెనాల్ట్ అప్‌గ్రేటెడ్ వెర్షన్స్ అయిన ట్రైబర్ MPV, కిగర్ SUVలను 2025 రెండవ భాగంలో విడుదల చేయాలని కంపెనీ ఆలోచిస్తోంది. డిజైన్, ఫీచర్ అప్‌డేట్‌లతో ఇవి వస్తాయని సమాచారం. 

click me!

Recommended Stories