Village Business: కొంచెం కష్టపడితే గ్రామాల్లోనూ నెలకు లక్ష రూపాయల ఆదాయాన్నిచ్చే బిజినెస్‌లు ఇవి

Published : Jun 04, 2026, 04:53 PM IST

Village Business: గ్రామాల్లో ఉంటూనే మంచి వ్యాపారం చేయాలనుకునేవారికి ఇక్కడ మేము కొన్ని ఐడియాలు ఇచ్చాము. ఈ వ్యాపారాలతో నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. సరైన ప్లానింగ్, కష్టపడి పనిచేస్తే ఈ బిజినెస్‌లలో సక్సెస్ అవుతారు.

PREV
13
నాటుకోళ్ల పెంపకంతో లాభాలు

మీరు గ్రామాల్లోనే ఉంటూ నాటు కోళ్ల పెంపకాన్ని మొదలుపెడితే మంచి లాభాలు వస్తాయి. ఫారం కోళ్లతో పోలిస్తే నాటు కోళ్ల ధర ఎక్కువగా ఉంటుంది. వీటిని నగరాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. కోళ్లకు నాణ్యమైన ఫీడ్, సరైన వైద్య సంరక్షణ అందిస్తే నష్టాలు కూడా రావు. మొదట చిన్నగా పది నుంచి పదిహేను కోళ్లతో ప్రారంభించి, ఆ తర్వాత వ్యాపారాన్ని విస్తరించవచ్చు. మార్కెట్ ధరలను పరిశీలిస్తు అమ్మకాలు జరిపితే లాభాలు పెరుగుతాయి. నెలకు మీరు అమ్మే కోళ్లను బట్టి  రూ.30,000 నుంచి రూ.1,00,000 ఆదాయం వస్తుంది. 

దీనితో పాటూ సైడ్ బిజినెస్ గా నాటు కోళ్ల గుడ్లను కూడా అమ్మవచ్చు. వీటిపై కూడా అదనపు ఆదాయం వస్తుంది. సాధారణ గుడ్లతో పోలిస్తే నాటు కోళ్ల గుడ్ల రేటు ఎక్కువ. వీటిని వేరు వ్యాపారంగా పెట్టి మరో రూ. 50,000 వరకు సంపాదించవచ్చు.

23
అయిదు ఆవులు ఉంటే చాలు

పాడి పరిశ్రమకు ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ పాలు, పెరుగు అత్యవసరం. అలాగే నెయ్యి, వెన్న, చీజ్ కోసం కూడా పాలు అవసరం. ఇది స్థిరమైన ఆదాయం ఇచ్చే వ్యాపారం. మొదట్లో 5 నుంచి 10 ఆవులతో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. మంచి జాతి ఆవు, గేదెలను ఎంచుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాలను పాల సొసైటీలకు లేదా హోటళ్లకు అమ్మవచ్చు.   ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పాడి పరిశ్రమ కోసం సబ్సిడీతో కూడిన రుణాలు కూడా ఇస్తున్నాయి. నెలకు మీ దగ్గర ఉన్న ఆవులను బట్టి నెలకు రూ.40,000 నుంచి రూ.1,20,000 వరకు పొందవచ్చు.

33
పుట్టగొడుగుల బిజినెస్

పుట్టగొడుగుల పెంపకం కూడా మొదలుపెట్టవచ్చు.  తక్కువ స్థలంలో, తక్కువ పెట్టుబడితో దీన్ని ప్రారంభించవచ్చు. నగరాల్లోని రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు పుట్టగొడుగులను ఎక్కువగా కొనే అవకాశం ఉంది. ఒక చిన్న గదిలో కూడా పుట్టగొడగులు పెంచవచ్చు. సరైన ఉష్ణోగ్రత, తేమ ఉండేలా చూసుకుంటే చాలు. ప్రస్తుతం పుట్టగొడుగులను ఎండబెట్టి, ప్యాకింగ్ చేసి అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. మీ వ్యాపార సైజును బట్టి నెలకు రూ.25,000 నుంచి రూ.80,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories