Gold Prices: ఇవాళ మరోసారి సిల్వర్ మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది. బంగారమైతే రోజు రోజుకు భయపెడుతూనే ఉంది. అయితే వెండి మాత్రం కాస్త ఊరటనిచ్చింది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
పెట్టుబడిదారులు బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉండటం వల్ల ఏం చేయాలో పాలుపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే పది రోజుల్లోనే పసిడి ధరలు భారీగా తగ్గడంతో మార్కెట్లో కొనుగోలుదారుల దృష్టి మళ్లీ బంగారంపైనే పడింది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలపడటం, క్రూడ్ ఆయిల్ మార్కెట్ మార్పులు కలిసి గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. మరి ఈరోజు హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
24
పసిడి ప్రియులకు ఇవాళ నిజంగా గుడ్ న్యూస్
ఎప్పుడూ బంగారం గురించే కాదు...ఈసారి వెండి లెక్కేంటో చూద్దాం. ఈసారి పుత్తడి కంటే సిల్వర్ భారీగా క్షీణించింది. దీంతో సిల్వర్ ఆభరణాలు చేయించుకునేవారికే పండగే. ఎందుకంటే బంగారం ధరలు పెరగడంతో...చాలా మంది సిల్వర్‍తో ఆర్నమెంట్స్ చేయించుకుంటున్నారు. దీంతో వెండికి రోజూ డిమాండ్ పెరుగుతోంది. వెండి వస్తువులకు బంగారం కోట్ చేయించుకోవడం వల్ల జ్యూవెలరీ రెడీ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు బంగారం ధరల కంటే వెండి రేట్లు చాలా ముఖ్యం. అందుకే గోల్డ్ ను పక్కన పెట్టేసి వెండిపై మొగ్గుచూపుతున్నారు.
34
ఇవాళ తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి
రెండు రోజులు స్థిరంగా ఉన్న ధరలు...ఇవాళ కాస్త వెనక్కి తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, సిల్వర్ ధరలుక్షీణించాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.110 తగ్గి రూ.1,56,110కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,43,100 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు ఒక్కసారిగా తగ్గింది. కిలో వెండి ధరపై రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,85,000 వద్ద అందుబాటులో ఉంది.
డాలర్ బలపడి రూపాయి పతనం కావడంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే పసిడి ఇతర దేశాలవారికి ఖరీదవుతుంది. దీంతో గోల్డ్‌కు డిమాండ్ తగ్గుతుంది. వెండి ధరల్లో కొనసాగుతున్న ఈ తగ్గుదల కొనుగోలుదారులకు ఇదొక అవకాశంగా మారుతోంది.