అందంగా కనిపించేందుకు అమ్మాయిల రక్తంతో స్నానం.. భయం పుట్టించే ఒక క్రూరమైన యువరాణి కథ..

First Published Aug 5, 2021, 12:34 PM IST

చరిత్రలోని ఎన్నో కథలు, రహస్యాలు మనకు తెలియనివి  తెరపైకి వస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అలాంటి ఒక రాణి కథ  మీరు వింటే వెన్నులో  భయం పుడుతుంది. ఈ రాణి  ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ కూడా. 

మీరు చాలా మంది సీరియల్ కిల్లర్‌ల గురించి వినే ఉంటారు, ఇంకా వరుస హత్యలు చేసి చేసిన వారిని చూసుంటారు కానీ ఈ రాణి కథ మీకు వణుకు పుట్టిస్తుంది.  ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రాణి పెళ్లికాని అమ్మాయిలను చంపి వారి రక్తంతో స్నానం చేసేదట. 

హంగేరిలో నివసిస్తున్న ఈ రాణి పేరు ఎలిజబెత్ బాతరీ. ఎలిజబెత్ బాతరీ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, క్రూరమైన మహిళా సీరియల్ కిల్లర్‌గా ప్రసిద్ధి చెందింది. 1585 నుండి 1610 మధ్య ఎలిజబెత్ బాతరీ 600 కంటే ఎక్కువ మంది బాలికలను అంటే పెళ్లికాని కన్యాలను చంపి వారి రక్తంతో స్నానం చేసేదట. తన అందాన్ని కాపాడుకోవడానికి కన్యల రక్తంతో స్నానం చేయమని ఎలిజబెత్‌కి ఎవరో సలహా ఇచ్చారని చెబుతుంటారు. ఎలిజబెత్ ఈ పద్ధతిని బాగా ఇష్టపడి దాని కోసం ఆమె క్రూరమైన హత్యలను చేసింది.

సీరియల్ కిల్లర్ ఎలిజబెత్ బాతరీ బాలికలను చంపిన తర్వాత క్రూరంగా చేష్టలను కూడా మానుకోలేదు. ప్రసిద్ధ కథనాల ప్రకారం ఆమె చనిపోయిన అమ్మాయిల మాంసాన్ని తన పళ్లతో కొరికి బయటకు తీసేదట. ఎలిజబెత్ బాతరీ  ఈ భయంకరమైన నేరలలో ఆమె ముగ్గురు సేవకులు కూడా మద్దతు ఇచ్చారని కూడా చెబుతుంటారు.

నిజానికి ఎలిజబెత్ బాతరీ హంగేరియన్ రాజ కుటుంబానికి చెందిన యువరాణి. ఎలిజబెత్ బాతరీ టర్కీలకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో హంగేరి జాతీయ హీరో అయిన ఫెరెంక్ నాడేస్డీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఎలిజబెత్ బాతరీ తన వలలో అమ్మాయిలు చిక్కుకునేందుకు భారీ పన్నాగాలు నేసేది. ఎలిజబెత్ బాతరీ  ఉన్నత స్థాయిలో ఉన్న మహిళ కావడంతో ఆమె సమీపంలోని గ్రామాల నుండి పేద అమ్మాయిలను డబ్బు కోసం పని చేసేలా ఆకర్షిస్తూ తన రాజభవనానికి ఆహ్వానించేది. కానీ అమ్మాయిలు రాజభవనానికి వచ్చిన వెంటనే ఆమె వారిని తన అందానికి బలిచేసేది.

అయితే ఈ  ప్రాంతంలో బాలికల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో  ఆమె ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన బాలికలను వేటాడటం ప్రారంభించింది. హంగేరి రాజుకు ఈ విషయం తెలిసాక అతను ఈ విషయం పై తీవ్రంగా విచారణ చేపట్టాడు. ఈ విషయానికి సంబంధించి పరిశోధకులతో ఎలిజబెత్ ప్యాలెస్‌కు చేరుకున్నప్పుడు అక్కడి పరిస్థితులను చూసి వారు ఆశ్చర్యపోయారు. ఎలిజబెత్ బాతరీ ప్యాలెస్ నుండి ఎంతో మంది అమ్మాయిల అస్థిపంజరాలు, బంగారు ఇంకా వెండి ఆభరణాలను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది.
 

1610 సంవత్సరంలో ఎలిజబెత్ బాతరీ చేసిన ఘోరమైన నేరాలకి అరెస్టు చేయబడింది. అయితే ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన  ఎలిజబెత్‌ బాతరీను ఉరి తీయలేదు, కానీ ఆమెని తన సొంత ప్యాలెస్‌లోని ఒక గదిలో ఖైధిగా  నిర్భందించారు. అక్కడ ఆమె నాలుగు సంవత్సరాల తరువాత 21 ఆగస్ట్ 1614న మరణించింది.

undefined
click me!