మరో సరికొత్త వ్యాపారంలోకి ముకేష్ అంబానీ మాస్టర్ ప్లాన్.. త్వరలోనే రిలయన్స్ చేతికి సబ్‌వే..?

First Published Aug 4, 2021, 7:09 PM IST

 మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పుడు సరికొత్త ప్రణాళికకు సిద్ధమవుతోంది. రిలయన్స్, యూ‌కే  ఆధారిత బ్రిటిష్ పెట్రోలియం కంపెనీల మధ్య జాయింట్ వెంచర్ అయిన రిలయన్స్, బి‌పి మొబిలిటీ హైవేలపై ఉన్న పెట్రోల్ పంపుల వద్ద రిటైల్ అవుట్‌లెట్‌లను తెరవడానికి ప్లాన్ చేస్తోంది. 

హైవేలపై ఉన్న రిలయన్స్ పెట్రోల్ పంపులలో ఫుడ్, డిజిటల్ అండ్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ బిజినెస్ ని కంపెనీ ప్రారంభించవచ్చు.  మీడియా నివేదికల ప్రకారం  రిలయన్స్ రిటైల్ ఈ అవుట్‌లెట్‌లను నిర్వహించనుంది. ఇందులో స్మార్ట్ పాయింట్ కన్వీనియన్స్ స్టోర్లు, డిజిటల్ స్టోర్లు, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు, కేఫ్‌లు, ఇతర ఆహార ఇంకా పానీయాల అవుట్‌లెట్‌లు ఉంటాయి. దీని కోసం రిలయన్స్, బి‌పి మొబిలిటీ ఇతర ఆహార, పానీయాల చైన్ తో కూడా చర్చలు జరుపుతోంది. అలాగే  సంస్థతో ఒక అవుట్‌లెట్ ని కూడా తెరవడానికి వారికి ఆఫర్ చేయనుంది.

దేశంలో రిలయన్స్ బిపికి 1400 పెట్రోల్ పంపులు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో దీన్ని 5,500కి పెంచాలని యోచిస్తుంది. సమాచారం ప్రకారం దేశంలో పెరుగుతున్న హైవే రిటైల్ బిజినెస్ సద్వినియోగం చేసుకోవడమే కంపెనీ లక్ష్యం. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ప్రకారం, దేశంలో హైవే రిటైలింగ్‌లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మార్కెట్ 2030 నాటికి 2.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. గత సంవత్సరం నైట్ ఫ్రాంక్ 2017లో దేశంలో రోడ్ నెట్‌వర్క్ 5.8 మిలియన్ కి.మీ అని తెలిపింది. అంటే యు.ఎస్ తర్వాత ఇండియా  రోడ్ నెట్‌వర్క్ లో అతిపెద్దది.

ప్రపంచంలోని అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రెస్టారెంట్ చైన్ సబ్‌వే ఇంక్  భారతీయ ఫ్రాంచైజీని రిలయన్స్ కొనుగోలు చేయవచ్చని కొన్ని నివేదికలు వెల్లడించాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) వ్యాపారం పై దృష్టి సారించారు. సబ్‌వే  ప్రధాన కార్యాలయం యూ‌ఎస్‌ఏ లోని కనెక్టికట్‌లో ఉంది. భారతదేశంలో ఈ కంపెనీ తన వ్యాపారాన్ని అనేక స్థానిక మాస్టర్ ఫ్రాంచైజీల ద్వారా నిర్వహిస్తుంది. ఒక వార్తా పత్రిక  ప్రకారం, ఈ డీల్ 200 మిలియన్ డాలర్ల నుండి 250 మిలియన్ డాలర్ల మధ్య అంటే రూ .1,488 కోట్ల నుండి రూ .1,860 కోట్ల మధ్య ఉండవచ్చని వర్గాలు చెబుతున్నాయి.

 ఈ ఒప్పందం తరువాత రిలయన్స్ రిటైల్ నేరుగా డొమినోస్ పిజ్జా, బర్గర్ కింగ్, పిజ్జా హట్, స్టార్‌బక్స్  అండ్ వారి లోకల్ పర్ట్నర్ టాటా గ్రూప్, జూబిలెంట్ గ్రూప్‌తో పోటీపడుతుంది. భారతదేశవ్యాప్తంగా సబ్‌వేకి దాదాపు 600 స్టోర్‌లను కలిగి ఉంది. 

undefined
click me!